Share News

మెరుగైన వైద్యం అందించేందుకే పల్లె దవాఖానాలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:50 AM

పల్లెల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

మెరుగైన వైద్యం అందించేందుకే పల్లె దవాఖానాలు

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె దవాఖానాలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ఆరోగ్య సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. పల్లె దవాఖానాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలన్నారు. పల్లె దవాఖానాలతో ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తోం దన్నారు. పల్లె దవాఖానాలు దూర ప్రాంతంలో ఉండడం వల్ల రోగుల సౌకర్యార్థం ఎలక్ర్టిక్‌ ఆటో ను ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీటీసీ బాలరాజుయాదవ్‌ కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ను కోరారు. జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫైడ్‌, సర్పం చ్‌ నర్సింలు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగం, ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, మండల ప్రత్యేక అధి కారి అఫ్జల్‌బేగం, తహసీల్దార్‌ దివ్యజ్యోతి, ఎంపీ డీవో సత్తయ్య, పీఆర్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, వైద్యాధికారి సరియాఅంజుమ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:50 AM