Share News

20 వరకు ప్రజాసంక్షేమ వికసిత్‌ భారత్‌ సంకల్ప సమ్మేళనాలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:24 AM

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పదవి చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఈనెల 20వ తేదీవరకు ప్రజాసం క్షేమ వికసిత్‌ భారత్‌, సంకల్ప సమ్మేళనాలను ఖచ్చితంగా చేపట్టా లని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు.

20 వరకు ప్రజాసంక్షేమ వికసిత్‌ భారత్‌ సంకల్ప సమ్మేళనాలు

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పదవి చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఈనెల 20వ తేదీవరకు ప్రజాసం క్షేమ వికసిత్‌ భారత్‌, సంకల్ప సమ్మేళనాలను ఖచ్చితంగా చేపట్టా లని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. సిరిసిల్ల పట్టణంలోని తన నివాసంలో సోమవారం జిల్లా పదాఽధికారులు, మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 సంవత్సరాల కాలంలో దేశం ప్రపంచ వేదికపై మరింత బలంగా నిలిచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ వరకు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలు, వివిధ మండలాలు, శక్తి కేంద్రాలు, బూత్‌ స్థా యిల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప సమ్మేళనాలు నిర్వహించాలన్నా రు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్య కర్తలు, వివిధ వర్గాల ప్రముఖులు కలిసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చా రు. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ పరిధిలో వికసిత్‌ భారత్‌ సంకల్పసభ లు, ప్రెస్‌మీట్‌లు, మేధావులతో సమావేశాలు, లబ్ధిదారుల సమ్మేళనా లు, యువత, మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరా రు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్‌, పార్లమెంట్‌ కోకన్వీనర్‌ ఆడెపు రవీందర్‌, రాష్ట్ర కౌన్సి ల్‌ మెంబర్‌ మ్యాన రాంప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బండ మల్లేశం, కార్యదర్శి సురేందర్‌రావు, కోశాధికారి ఆసాని రామలింగా రెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, ఆయా మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 12:24 AM