కాంగ్రెస్ శ్రేణుల విజయోత్సవ ర్యాలీ
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:44 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన వేయి రోజులు పూర్తి చేసుకున్న సందర్భం గా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ అంబరాన్నంటాయి.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన వేయి రోజులు పూర్తి చేసుకున్న సందర్భం గా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ అంబరాన్నంటాయి. శుక్ర వారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం పాత బస్టాండ్ నేతన్న చౌక వద్ద కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీని జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ ప్రారంభించారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, నాయకులు, ప్రజాప్రతినిధు లు చేనేత విగ్రహానికి పూలమాలలు వేశారు. చేనేత చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబే ద్కర్, ఫూలే దంపతుల విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా గాంధీచౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. గాంధీచౌక్‌లోని జాతిపిత మహా త్మాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి టపాసులు కాల్చి కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లా డారు. కాంగ్రెస్ ప్రజాపాలన వేయి రోజులు పూర్తి చేసుకున్న సందర్భం గా విజయోత్సవ ర్యాలీని నిర్వహిచామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వేయి రోజులలో అమలు చేయడంలో విజయం సాధించామన్నారు. పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలన ఎలా ఉండేనే వేయి రోజుల రేవంత్‌రెడ్డి పాలనను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందన్నారు. పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో అర్హులైన బడుగు బలహీన వర్గాలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ అన్నివర్గాలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాగుల జగన్, వేముల దామోదర్, భూపాల్, ఉపాధ్యక్షులు పిల్లి కనకయ్య, కొమర య్య, జిల్లా కార్యదర్శి విష్ణుప్రసాద్, ప్రచార కార్యదర్శి చొక్కాల రాము, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, వేములవాడ పట్టణ అధ్యక్షుడు తూం మధు, అర్బన్ అధ్యక్షుడు పరశురాం, ఉపాధ్య క్షుడు కూరగాయల కొమరయ్య, కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శి నీలి రవీందర్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్, లింగంపల్లి గంగరాజు, వెంగళ లీలా,కూర శ్రీశైలం, టౌన్‌క్లబ్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, కుమార్, యెల్లె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.