Share News

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

ABN , Publish Date - May 26 , 2026 | 12:39 AM

పోలీసుస్టేషన్‌కు వచ్చె బాధితుల కు న్యాయపరంగ, పారదర్శకంగా విచారణ జరిపి సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డే సందర్బంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలి
జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ

జగిత్యాలటౌన్‌, మే 25(ఆంధ్రజ్యోతి): పోలీసుస్టేషన్‌కు వచ్చె బాధితుల కు న్యాయపరంగ, పారదర్శకంగా విచారణ జరిపి సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డే సందర్బంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పోన్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకొని భాదితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్‌ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషిచేస్తున్నామని అన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ట్రాఫిక్‌ సిబ్బంది ఆరోగ్య రక్షణకు చర్యలు

జగిత్యాల టౌన్‌ : జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం జిల్లా పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో సోమవారం ట్రాఫిక్‌ సిబ్బందికి కూలింగ్‌ గాగుల్స్‌, వాటర్‌ ప్లాస్క్‌లను ఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ అశోక్‌ కమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సిబ్బంది ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, జాతీయ రహదారుల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని అన్నారు. ఎండ తీవ్రత కారణంగా కలిగే డీహైడ్రేషన్‌, హీట్‌ స్ర్టోక్‌, అలసట వంటీ ఆరోగ్య సమస్యల నుండి సిబ్బందిని రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్‌ నితిన్‌, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, టౌన్‌ ఇన్స్పెక్టర్‌ పి. కరుణాకర్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ మల్లేశం, టౌన్‌ ఎస్‌ఐ సుప్రియ, ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 12:39 AM