Share News

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:29 AM

వివిధ సమస్యలపై పోలీస్‌ స్టేషనకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. కరీంనగర్‌ టూటౌన పోలీస్‌ స్టేషనను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలి
సిబ్బందితో మాట్లాడుతున్న సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యలపై పోలీస్‌ స్టేషనకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. కరీంనగర్‌ టూటౌన పోలీస్‌ స్టేషనను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన జనరల్‌ డైరీ (జీడీ), ఎఫ్‌ఐఆర్‌ కాపీలు, పెండింగ్‌ కేసులు, రౌడీ షీటర్ల రికార్డులు పరిశీలించారు. అనంతరం పోలీస్‌ స్టేషన ఆవరణ, రిసెప్షన కౌంటర్‌, లాకప్‌ రూంలను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.... పోలీసు స్టేషనకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను శ్రద్ధగా వినాలని సిబ్బందిని ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో టౌన ఏసీపీ వెంకటస్వామి, టూటౌన సీఐ కె సృజనరెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:29 AM