Share News

వేములవాడ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

ABN , Publish Date - May 06 , 2026 | 12:34 AM

వేములవాడ మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్నికలు స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మంది రంలో మంగళవారం జరిగాయి.

వేములవాడ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

వేములవాడ రూరల్‌, మే 5(ఆంధ్రజ్యోతి) : వేములవాడ మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్నికలు స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మంది రంలో మంగళవారం జరిగాయి. నలుగురు కోఆప్షన్‌ సభ్యులుగా కట్కూరి శ్రీనివాస్‌, పీర్‌ మొహమ్మద్‌, తుమ్మ జ్యోతి ఇన్నారెడ్డి, దుర్గం విజయ పర్శ రాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ హాజరై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రగతిలో కోఆప్షన్‌ సభ్యుల పాత్ర ఎంతో కీలకమన్నారు. నూతనంగా ఎన్నికైన కోఆప్షన్‌ సభ్యులతో ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు కోఆప్షన్‌ సభ్యులను ఘనంగా సత్కరించారు. మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు మాట్లాడుతూ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ చొరవతో పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. ఈ నేపథ్యంలో కోఆప్షన్‌ సభ్యుల పాత్ర ఎంతో కీలకమన్నారు. మున్సిపల్‌ పాలకవర్గం తీసుకునే ప్రతీ నిర్ణయం పట్టణ ప్రజల జీవన ప్రమాణా లను పెంచే దిశగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు సంఘ హనుమవ్వ, గుడిసె సంతోష, తోట రాజు, కాశ శ్రీనివాస్‌, ఆలె శ్రీనివాస్‌, సిరిగిరి సంగీత, రామ తీర్థపు కృష్ణవేణి, మూడపల్లి నీలమ్మ, తూం మధు, కొండ శేఖర్‌, కుమ్మరి శిరీష, ఇప్పపూల మమత, అన్నారం శ్రీనివాస్‌, కొక్కుల బాలకృష్ణ(రాజు) పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:34 AM