Share News

వాహనాలను భద్రంగా, బాధ్యతతో నడపాలి

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:50 AM

ప్రతి వాహనదారుడు తమ వాహనాన్ని భద్రంగా, బాధ్యతతో నడపాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

వాహనాలను భద్రంగా, బాధ్యతతో నడపాలి

వేములవాడ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రతి వాహనదారుడు తమ వాహనాన్ని భద్రంగా, బాధ్యతతో నడపాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని గురువారం తిప్పాపూర్‌లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీ గితే తో కలిసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ రంగులను పోలే బెలూన్లను, శాంతి కపోతాలను ఎగుర వేశారు. రోడ్డు భద్రతకు సంబంధించిన స్టికక్కర్లను వాహనాలకు అతికిం చారు. అనంతరం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తిప్పాపూర్‌ బస్టాండ్‌ నుంచి కోరుట్ల బస్టాండు వరకు స్వయంగా ఆటోను నడిపారు. తదనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు వచ్చే రహదారులకు మరమ్మతు చేయిస్తు న్నామని తెలిపారు. శివరాత్రిని పురస్కరించుకుని ఆటోడ్రైవర్లు వివిధ ప్రాం తాలు, రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల, భక్తులను క్షేమంగా గమ్యం చేర్చా లని సూచించారు.

వాహనాలను అతివేగంగా నడపవద్దు..

- ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

వాహనదారులు తమ వాహనాలను అతివేగంగా నడపవద్దని, మొబైల్‌ చూస్తూ వాహనాలు నడపవద్దని, స్కూల్‌ ఆటోల్లో పరమితికి మించి విద్యా ర్థులను తీసుకువెళ్లవద్దన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహ నదారులు, ఆటోడ్రైవర్లు ప్రమాదబారిన పడుతున్నారని అన్నారు. నో హెల్మె ట్‌, నో పెట్రోల్‌ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ద్విచక్ర వాహ నదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని పిలుపునిచ్చారు. బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించి నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని మొదటి గంటలో దవాఖానకు తరలించిన వారికి రహ వీర్‌ పథకం కింద రూ.25వేల ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. అనంతరం ఎస్పీ మహేష్‌ బీ గితే మాట్లాడుతూ హైస్పీడ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌ తోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణీకులను వాహనాల్లో తీసుకువెళ్లవద్దని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల, రోడ్డు ప్రమాదాల సమాచారం ఆటో డ్రైవర్లు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రుత్విక్‌ సారు, ఆర్డీవో రాధాబాయి, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్‌, ఎంవీఐ వంశీధర్‌, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రాకేష్‌, సిరిసిల్ల, వేములవాడ డిపో మేనుజర్లు ప్రకాష్‌రావు, శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:51 AM