డిమాండ్ ఉన్న కూరగాయలను సాగు చేయాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:01 AM
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయలను రైతులు సాగు చేయాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ కోరారు.
సిరిసిల్ల అర్బన్,సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయలను రైతులు సాగు చేయాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ కోరారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్ద బోనాలలో కాశెట్టి మల్లయ్య అనే రైతు ఎల్‌నినో ప్రభావంతో వరిసాగును వదిలి 4 ఎకరాల్లో వం కాయ, మిరప, కాకర పంటలను సాగు చేయగా మంగళవారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీ లించారు. ప్రస్తుతం వంకాయ దిగుబడి వస్తుం డగా వాటిని పరిశీలించి రైతును అభినందించా రు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరిని వదిలి కూరగాయలు సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తు తం వంకాయ దిగుబడి వస్తుందని వివరించా రు. వంకాయ మొక్కలు నాటిన 45 రోజులనుం చి దిగుబడి మొదలై దాదాపు ఆరునెలల వరకు ప్రతివారం పంట చేతికి వస్తుందని వెల్లడించారు. అన్ని ఖర్చులు పోను ఏడాదికి రెండులక్షలకు పైగా ఆదాయం వస్తుందని రైతు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఉ ద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు కూరగాయలు, పండ్లతోటలు, ఆయిల్‌పామ్ ఇత ర పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, తహసీల్దార్ మహేష్‌కుమార్‌రావు పాల్గొన్నారు.