Share News

అర్హులందరికి చేయూత పెన్షన్లు..

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:16 AM

అర్హులందరికి చేయూత పెన్సన్‌లు మంజూరు చేస్తున్నామని కలెక్టర్‌ గరిమ ఆగ్రవాల్‌ తెలిపారు.

అర్హులందరికి చేయూత పెన్షన్లు..

ముస్తాబాద్‌ (గంభీరావుపేట), నవంబరు 17 (ఆంధ్ర జ్యోతి) : అర్హులందరికి చేయూత పెన్సన్‌లు మంజూరు చేస్తున్నామని కలెక్టర్‌ గరిమ ఆగ్రవాల్‌ తెలిపారు. ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని ఫంక్షన్‌ హాల్‌లో 625 మంది లబ్ధిదారులకు పెన్షన్‌ మంజూరు పత్రాలను మం గళవారం పంపిణీ చేశారు. కలెక్టర్‌ గరిమ ఆగ్రవాల్‌ మాట్లాడుతూ చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు ఈనెల 18 వరకు మంజూరు పత్రాలు అందిస్తామని, 19వ తేదీ తర్వాత లబ్దిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. జిల్లా మొత్తంలో 8,209 పెన్సన్‌లు మంజూరు కాగ, మస్త్తాబాద్‌లో 625 మందికి నూతన పెన్సన్‌లు మంజూరు పత్రాలు పంపిణి చేశామన్నారు. జిల్లాలో 4 వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యాయని, త్వరలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథ కం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల విలువైన బీమా వర్తిస్తుందని, అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డు ల్లో నెల రోజుల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేష్‌రెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ అంజిరెడ్డి, మండలప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నిర్మల, తహసీల్దార్‌, ఎంపీడీవో తదితరు లు ఉన్నారు.

రైతుకు అభినందనలు..

వేర్వేరు పంటలతో మెరు గైన ఆదాయం పొందున్న చింతలకుల చంద్రం అనే రైతును కలెక్టర్‌ అభినందించా రు. బందనకల్‌లో రైతు చంద్రం వరి సాగును వదిలి కూరగాయలు సాగు చేస్తున్నాడు. తనకున్న మూడెకరా ల్లో ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల తో వేర్వేరు పంటలు సాగుచేసి నిరంతర ఆదాయం పొందుతున్నాడు. కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు ను అభినందించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికార శరత్‌ బాబు, వ్యవసాయ శాఖ అధికారి ప్రదీప్‌, తహ సీల్దార్‌ ఫారుఖ్‌ తదితరులు ఉన్నారు.

ప్రశ్న పత్రాలు సాధన చేయాలి

పదో తరగతి విద్యార్థులు గత ప్రశ్న పత్రాలు సాధన చేయాలని, రానున్న వార్షిక పరీక్షల్లో విజయం సాధించా లని కలెక్టర్‌ ఆక్షాంక్షించారు. చీకోడ్‌ ప్రభుత్వ విద్యాలయా న్ని కలెక్టర్‌ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం గదిని పరిశీలించి.. నిర్వాహకులకు పలు సూచన లు చేశారు. కంప్యూటర్‌ గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ముందుగా సోలార్‌ ఫెన్సింగ్‌ను ప్రారంభించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు గణితం ప్రశ్నలు వేసి, సమాధానాలు రా బట్టారు. వెంట తహసీల్దార్‌ ఫారుఖ్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెడతారని, వారిని ప్రతిరోజు కేంద్రాల కు పంపించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ముస్తాబాద్‌ అంగర్‌వాడీ కేంద్రంలో మంగళవారం 10నిమిషాల కార్య క్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించా రు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పా టుచేయగా పరిశీలించారు. పిల్లల పెరుగుదల పర్యవేక్ష ణ కార్డులను ఆవిష్కరించారు. అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలో తనిఖీ చేశారు. నూతన యూనిఫాంలు వే సుకున్న విద్యార్థులతో మాట్లాడారు. సర్పంచ్‌లు అంగన్‌ వాడీ కేంద్రాలను పరిశీలించాలని, సామ్‌, మామ్‌ పిల్లల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోషకాహారం అందేలా చూ డాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మట్ట వెంకటేశ్వర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ఫారుఖ్‌, ఎంపీడీవో లచ్చాలు ఉన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:16 AM