వీబీజీరామ్‌జీ పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:13 AM
వీబీజీరామ్‌జీలో భాగంగా నీటి సంరక్షణ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయించాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): వీబీజీరామ్‌జీలో భాగంగా నీటి సంరక్షణ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయించాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ అదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం వీబీజీరామ్‌జీ, జల్ సంచాయ్ జన్ భగీదరి, తెలంగాణ జలసిరి పనులపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీశాఖ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమా వేశాన్ని నిర్వహించారు. జేఎస్‌ఏసీటీఆర్, జేఎస్‌జేబీ 1.0, జేఎస్‌జేబీ 2.0 కింద గతంలో చేపట్టిన పనుల మరమ్మతులు, నిర్వహణ పనులు 34802, వ్యక్తిగత ఇంకుడు గుంతలు 8676, సామూహిక ఇంకుడు గుంతలు 577, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు 221, ఫామ్‌పాండ్‌లు 1056, పెర్కొలేషన్ ట్యాంకులు 240 లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమ లక్ష్యానికి అనుగుణంగా పనులను చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర భద్రయ్య, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మిషన్ భగీరథ ఈఈ సుమలత, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.