వచ్చే నెల నుంచి వీబీజీ రామ్ జీ
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:04 AM
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం మరో నెల రోజుల పాటు కొనసాగునున్నది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కావలసి ఉండగా, దీనిని ఆయా రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండడం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనుండడంతో పథకం అమలును ఒక నెల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం మరో నెల రోజుల పాటు కొనసాగునున్నది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కావలసి ఉండగా, దీనిని ఆయా రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండడం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనుండడంతో పథకం అమలును ఒక నెల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచే సవరించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాల్సి ఉండేది. కానీ మరో నెల రోజుల పాటు పాత పద్ధతిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నెల రోజులకు గాను రాష్ట్రానికి కేంద్రం రెండు కోట్ల పని దినాలను కేటాయించింది. అందులో భాగంగా జిల్లాకు 3 లక్షలకు పైగా పని దినాలను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే 2026-27 సంవత్సరానికిగాను పెద్దపల్లి జిల్లాలో 33.31 లక్షల పని దినాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొం దించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
ఫ ఇరవై ఏళ్ళుగా ఉపాధి పథకం అమలు
ఇరవై సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఈ పథకం చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్ గార్ అజివిక మిషన్ (వీబీజీ రామ్)గా పేరు మార్చింది. ఈ పథకాన్ని ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలు, వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా నిరోధించేందుకు 2005-06 సంవ త్సరంలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఉన్న కూలీలకు ఏడాదికి 100 రోజుల పని దినాలను కల్పిం చాలని చట్టం చేసింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో 60 శాతం తప్పనిసరిగా కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని నిర్దేశించింది. 40 శాతం నిధులను మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామాల్లో శాశ్వత నిర్మాణ పనులకు కేటాయించాలని చట్టం చేశారు. ఈ పథకం ద్వారా యేటా అక్టోబర్, నవంబరు మాసాల్లో గ్రామసభలు నిర్వహించి పను లను గుర్తించనున్నారు. గుర్తించిన పనుల్లో ఉపాధి కూలీలకు కల్పించే పని దినాల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే పని దినాలను కేటా యించే వారు. కేటాయించిన పని దినాల ఆధారంగా 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనులు జనరేట్ అయ్యేవి.
ఫ పథకంలో మార్పులు
మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు తీసుకురావాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చట్టంలో మార్పులు చేసింది. జాబ్‌కార్డులు పొందిన కుటుంబాలకు తప్పని సరిగా కల్పించే వంద పని దినాలను 125 రోజులకు పెంచింది. అంతేకాకుండా ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రానికి, జిల్లాలకు కేటాయించే నిధుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించా లని చట్టంలో పేర్కొన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతి రేకించడంతో పాటు, పాత విధానాన్ని కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా సవరణ చేసిన కొత్త చట్టం ప్రకారమే ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభు త్వం మరో నెల గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని పొడిగించినట్లుగా తెలుస్తున్నది.