వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:26 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. 2005లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో వలసలను నివారించడం కోసం బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది కార్మికులకు ఉపాధిని కల్పించి వలసలను నివారించి 100రోజుల పనిని యూపీఏ ప్రభుత్వం కల్పించిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక యూపీఏ ప్రభుత్వంలో బడుగుబలహీన వర్గాలకు కోసం తీసు కొచ్చిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నీరుగార్చే విధంగా నిర్ణయా లను తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 12 సంవత్సరాల బీజీపీ పాలనలో బడుగుబలహీన వర్గాలకు ఏ ఒక్కటి అక్కరకు వచ్చే ఒక్క చట్టాన్ని తీసుకురాలేదని, ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలు చేసిన వారు బీజే పీలో ఏ ఒక్క నాయకుడు లేడన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పట్టేల్‌ను భూచిగా చూపి బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మహాత్మాగాంధీ పేరును తొలగిస్తూ వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడాన్ని ఖండి స్తున్నామన్నారు. ఉపాధిహామీ పథకంలో కేంద్రం 100శాతం నిధులను ఇచ్చేందని వీబీ జీరామ్ చట్టంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను మళ్లిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెడ్‌కార్పేట్ వేసి కార్పొరేట్‌కు అనుసంధానం చేయా లనే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరకడం లేదని మహాత్మాగాంధీ జాతీ య ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసి ఆ కార్పొరేటర్లకు ఉపాధి హామీ కూలీలను కాంట్రాక్టు కూలీలుగా మార్చేందుకు కుట్ర చేస్తోం దని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్ష పార్టీలు వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. అనంతరం వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలనే కరప త్రాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మైనార్టీసెల్ పట్టణ అధ్యక్షుడు అహ్మ ద్, తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీన్, మాజీ కౌన్సిలర్లు మడుపు శ్రీదేవి, రాగుల జగన్, కత్తెర దేవదాస్ పాల్గొన్నారు.