Share News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:46 AM

వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను అదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను అదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్ట రేట్‌లో ఆదివారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరై వాసవి మాత చిత్రపటానికి పూలమాల వేశారు. ఈకార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్‌, సీపీవో శ్రీనివాసచారీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ స్వప్నతోపాటు వైశ్య సంఘం సభ్యులు కటుకం సత్త య్య, అల్లాడి శ్రీనివాస్‌, రాజూరి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ మాత జయంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్పీ మహే ష్‌ బీగీతే ముఖ్యఅతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ యాదగిరి, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఐ సాయి కిరణ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:46 AM