భీమన్న ఆలయంలో ముగిసిన వరుణయాగం
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:08 AM
వేములవాడ భీమేశ్వర స్వామి ఆల యంలో చేపట్టిన వరుణయాగం శనివారం ముగిసింది.
వేములవాడ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): వేములవాడ భీమేశ్వర స్వామి ఆల యంలో చేపట్టిన వరుణయాగం శనివారం ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న అనా వృష్టి పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురువాలని సంకల్పించి వరుణ యాగాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతా పూజలు, గౌరి పూజ, విశ్వశాంతి కార్యక్రమాలను, ఇతర పూజలను ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. వరుణయాగ మహోత్సవం లో భాగంగా శనివారం ఉదయం మూలమంత్ర హోమం చేపట్టారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వ్యవధిలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వ హించారు. అనంతరం 108కలశాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామి వారికి మహామంగళహారతి సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న ఆలయ ఈవో రమాదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ స్వామివారిని దర్శించుకుని కలశపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమవాలో ఏఈవో జయకుమారి, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.