Share News

వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:42 AM

జీవితంలోను, పోరాటంలోను, మరణం లోను స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అన్నారు.

వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకోవాలి
వడ్డె ఓబన్న చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల, జనవరి11 (ఆంధ్రజ్యోతి): జీవితంలోను, పోరాటంలోను, మరణం లోను స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో వడ్డె ఓబన్న జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ మాట్లాడారు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రా జ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాల్‌ చేసిన సైరా...ఉయ్యాల వాడ నరసింహరెడ్డికి మిత్రుడు, ఆధ్యాంతం స్నేహితుని వెంట నడిచిన వీరుడు, స్వాతంత్ర సమరయోదుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. నంద్యాల జిల్లాలో సంజామల మండలం నొస్సాం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఓబన్న జీవిత చరిత్ర ఆదర్శనీయమన్నారు. అప్పట్లో గ్రామ రక్షకుల జీతాలను తెల్లదొరలు రద్దు చేశారని, బలవంతపు శిస్తు వసూళ్లు, రైతులపై అధిక పన్నుల తదితర అంశాలపై ఓబన్న పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి లక్ష్మణ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు మొగిలి, బాపిరాజు, గంగాధర్‌, మల్లేశం, నాయ కులు కప్పల శ్రీకాంత్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 12:42 AM