గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:56 PM
పశువుల సంరక్షణకు పెంపకందారు లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చా రు.
చందుర్తి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : పశువుల సంరక్షణకు పెంపకందారు లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చా రు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాల కేంద్రం ఆవరణలో మంగళ వారం నిర్వహించగా, ముఖ్య అతిథి గా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పాల కేంద్రాన్ని పరిశీలించి గ్రామంలో ఎన్ని పాడి పశువులు ఉన్నాయి? ఎన్ని లీటర్ల పాలు వస్తాయి? ఎక్కడ విక్రయిస్తారు తదితర వివరాలను పాల కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసు కున్నారు. అలాగే ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రోగాల బారిన పడిన పాడి పశువులు పాలు తక్కువ ఇస్తాయని వివరించారు. పాలు ఎగుమతులపై ఆ ప్రభా వం పడుతుందని స్పష్టం చేశారు. పెంపకందారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పెంపకందారులు తమ జీవాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తోంద న్నారు. పెంపకందారులు ముందస్తుగా టీకాలు వేయిం చి.. ఆ రోగాల బారి నుంచి తమ జీవాలను రక్షించాలని సూచించారు. అన్ని పాడి పశువులు, ఎద్దులు, దూడలకు పశువుల పెంపకందారులు, రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, జిల్లాలో 97 వేల జీవాలు ఉన్నాయని, పశు వైద్యాధికారులు, సిబ్బంది 26 టీమ్‌లుగా ఏర్పడి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళి కలో భాగంగా 99 రోజుల యాక్షన్‌ప్లాన్‌లో జిల్లాలోని అన్ని గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపా లిటీల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారని తెలిపారు. గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసి.. గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా సమా ఖ్య భవనాల నిర్మాణ పనులు వేగంగా పనులు చేపట్టి.. జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధికారి ఆధ్వర్యంలో యువతకు 5కే రన్, ఉపాధి కల్పన శాఖ ఆథ్వర్యంలో జాబు మేళాలు చేపడుతారని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, విద్యాశాఖ, అటవీ శాఖ, డీఆరీవో వివిధ శాఖల ఆద్వర్యంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణా ళికలో భాగంగా చేపడుతున్న పనుల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు.
పశువుల పాకలు శుభ్రంగా ఉండాలి
అనంతరం పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ పశువుల పాకలను శుభ్రంగా ఉండాలని సూచించారు. గాలికుంటు వ్యాధి బారిన పడిన జీవాల శరీర ఉష్ణోగ్రత పెరిగి పశువులు నీరసించి పోతాయని, పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందన్నారు. వాటి నోరు అలాగే గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, గంటల్లో చితికిపోయి పొక్కులు, పుండ్లుగా మారి నొప్పి వలన పశువులు మేత నీరు తీసుకోక నీరసించి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పశువుల పాకలను శుభ్రంగా ఉండాలని సూ చించారు. టీకాలు వేసి గుర్తింపు కొరకు చెవి పోగు వేయించి ఆ వివరాలు భారత పశుధాన్ యాప్‌లో నమో దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూది మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరు పతి, ఎంపీడీఓ రాధ, పశువైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.