వ్యాపారాభివృద్ధికి బ్యాంక్ రుణాల వినియోగం
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:10 AM
బ్యాంక్ రుణాలు వ్యాపారాభివృద్ధికి వినియోగించాలని కలె క్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల, అక్టోబరు 23 (ఆంరఽధజ్యోతి): బ్యాంక్ రుణాలు వ్యాపారాభివృద్ధికి వినియోగించాలని కలె క్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్లలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో ఎంఎస్‌ఎంఈ-సంవాద్ ద్వారా చేనేత, పవర్‌లూ మ్ రంగాలకు చెందిన యజమానులు, ఆసాములు, కార్మికులకు సంస్థాగత రుణాలపై అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడం, ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రక్రి యలను జోడించడం ద్వారా ఆదాయం, ఉపాధి అవ కాశాలను పెంపొందించుకోవడానికి మార్గనిర్దేశం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు బ్యాంకుల ద్వారా సంస్థాగత రుణాలు పొందుతూ, వాటిని వ్యాపారాభివృద్ధికి సద్వి నియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా ఎదిగి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాం క్షించారు. చేనేత పవర్‌లూమ్‌ల ద్వారా ఉత్పత్తి చేస్తు న్న వస్త్రాలకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరింత నాణ్యమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. చేనేత వస్త్రాల తయారీవైపు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు మార్పు చెందాలని, సిరి సిల్ల ఖ్యాతిని మరింత చాటాలని పేర్కొన్నారు. ఆర్బీఐ ఎల్‌డీవో చేతన్ మాట్లాడుతూ సంస్థాగ త రుణాల ప్రాధా న్యత, బ్యాంకుల ద్వారా లభించే రుణ సదుపా యాలు, ఆర్థిక క్రమ శిక్షణ, రుణాల సక్రమ వినియోగంపై అవగా హన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం దిలీప్‌చంద్ర, ఎల్‌డీ ఎం రాజీవ్‌కుమార్, ఇండస్ట్రీస్ జీఎం హనుమంతు, చేనే త, జౌళి శాఖ ఏడీ సంతోష్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, చేనేత, పవర్‌లూమ్ యూనిట్ యజమానులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.