శిక్షణ వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలి
ABN , Publish Date - May 22 , 2026 | 12:21 AM
ఉచిత శిక్షణను యువతీ యువకులు వినియోగించు కోవాలని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
సిరిసిల్ల, మే 21 (ఆంధ్రజ్యోతి): ఉచిత శిక్షణను యువతీ యువకులు వినియోగించు కోవాలని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, బ్యాంకుల సహకారంతో రూరల్ సెల్ప్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(ఆర్‌సెటీ) ఆధ్వర్యంలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ శిక్షణా కేం ద్రంలో ప్రారంభించారు. శిక్షణ ఇచ్చే ట్రైనింగ్, వసతి గదులను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మగ్గం వర్క్ కింద శిక్షణ పొంది పలువురు అభ్య ర్థులు సిద్ధం చేసిన వస్త్రాలను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున ్నారు. రోజూ ఎన్ని గంటలు శిక్షణ పొందుతున్నారో ఆరా తీశారు. మగ్గం వర్క్ తర్ఫీదు పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతున్నాయని వెల్ల డించారు. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఆర్‌సెటీ కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో కూడా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. జిల్లాలోని యువతీ యువకులు ఇక్కడ అందించే ఉచిత వసతి, భోజనం, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణలో భాగంగా అందించే ప్రతి మెలకువను ఎంతో శ్రద్ధ, ఆసక్తితో నేర్చుకొని స్వయం ఉపాధిలో ఆయా అంశాలు వినియోగించాలని సూచించారు. వినియోగదా రులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆర్థిక స్వాతంత్రం సాధించాలని ఆకాం క్షించారు. మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపు నిచ్చారు. మార్కెట్, పరిశ్రమల అవసరాలు, అభ్యర్థుల డిమాండ్‌కు అను గుణంగా నూతన కోర్సులు ప్రారంభించాలని, ఏడాది అంతా శిక్షణ అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, యూబీఐ డీజీఏం నటరాజ్, ఏజీఎం శ్రీనివాసరావు, ఎల్‌డీ ఎం మల్లికార్జున రావు, శిక్షణ కేంద్రం బాధ్యులు, బ్యాంక్ ప్రతినిధులు తదిత రులు పాల్గొన్నారు.