పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:53 AM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధుల కు హాజరయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధుల కు హాజరయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరి శీలించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కోసం సిద్ధం చేసిన ఫారాలను పరిశీలిం చారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటు లో ఉంటాయని, 8వ తేదీ ఆదివారం కూడా ఓటు హక్కు వినియోగించుకోవ చ్చని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేవారు సంబంధిత ఫారాలు జత చేసి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. పరిశీలనలో నోడల్ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.