Share News

యూరియా బేఫికర్‌

ABN , Publish Date - May 23 , 2026 | 01:05 AM

ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం చెప్పులు, పాసుబుక్కులు వరుసలో పెట్టడం, అర్ధరాత్రి నుంచి పడికాపులు కాయడం వంటి పరిస్థితులను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్‌ నుంచి రైతులకు మొబైల్‌ యాప్‌ ద్వారా ఎరువులను రైతులకు విక్రయించే చర్యలకు పూనుకుంది. యాప్‌ వినియోగంలో రైతులకు మొదట్లో కొంత ఇబ్బందులు ఏర్పడిన తర్వాత యాప్‌ వినియోగించుకునే విధానం తెలుసుకున్నారు.

యూరియా బేఫికర్‌

- ఖరీఫ్‌ సీజన్‌కు ముందస్తు చర్యలు

- యాప్‌ ద్వారానే ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు

- వానాకాలం పంటలకు 57,399 మెట్రిక్‌ టన్నుల అంచనా

- జిల్లాలో వానాకాలం సాగు 2.48 లక్షల ఎకరాలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం చెప్పులు, పాసుబుక్కులు వరుసలో పెట్టడం, అర్ధరాత్రి నుంచి పడికాపులు కాయడం వంటి పరిస్థితులను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్‌ నుంచి రైతులకు మొబైల్‌ యాప్‌ ద్వారా ఎరువులను రైతులకు విక్రయించే చర్యలకు పూనుకుంది. యాప్‌ వినియోగంలో రైతులకు మొదట్లో కొంత ఇబ్బందులు ఏర్పడిన తర్వాత యాప్‌ వినియోగించుకునే విధానం తెలుసుకున్నారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను కూడా వ్యవసాయ శాఖ పరిష్కరించింది. దీంతో ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తుగానే యూరియాకు ఇబ్బంది లేకుండా యాప్‌ ద్వారా రైతులు కొనుగోలు చేసుకునే దిశగా సన్నాహాలు పూర్తిచేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఇప్పటికే ఈనెల 23 నుంచి యూరియా విక్రయాలు యాప్‌ ద్వారా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దానికి అనుగుణంగా జిల్లా వ్యవసాయ యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్లో ప్రతి ఎకరానికి రెండు విడతల్లో రైతుకు రెండేసి యూరియా బస్తాలు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకు జిల్లా అధికారులు, క్షేత్రస్థాయిలో అధికారులు రైతులు అందుబాటులో ఉంటూ ఎరువుల విక్రయాలు ఇబ్బందులు రాకుండా, యాప్‌ ద్వారా ఎలాంటి సాంకేతిక సమస్య రాకుండా చూసేలా పర్యవేక్షణ చేయనున్నారు. రైతులు మొబైల్‌ నుంచి యూరియా యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న సమయంలో ఓటీపీ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు ఫోన్‌ నంబర్‌ మార్చుకునే రైతులు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి అప్డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ఈనెల 26న రాష్ట్రంలో ప్రవేశిస్తాయని సంకేతాలు వాతావరణ శాఖ ఇవ్వడంతో అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఎరువులు, విత్తనాలను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసింది. జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 48 వేల 507 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 91 వేల366 ఎకరాలు, పత్తి 47120ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3430 ఎకరాలు, ఇతర పంటలు 5593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56789 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 120.6 క్వింటాళ్లు, మొక్కజొన్న 59.84 క్వింటాళ్లు, పత్తి 123790 ప్యాకెట్లు, పెసర్లు 4.18 క్వింటాళ్లు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. వానాకాలం సాగుకు సంబంధించి 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, ఎరువులు 57399 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు.

ఎరువుల వినియోగం ఇలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సాగు ఖరీఫ్‌లో రైతులు 57399 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులను వినియోగిస్తారు.యూరియా 25944మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 3760 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 22710మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4225 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ760 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. జిల్లాలో ప్రస్తుతం 7639 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఎరువులల్లో యూరియా 4283 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 601 మెట్రిక్‌ టన్నులు, పొటాషియం 188మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 2567 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. అన్నదాతకు వానాకాలం పంటల సాగు ముందే ఎరువులు భారం పడింది. గత ఏడాది జూలైలో వివిధ ఎరువుల బస్తాలపై ఒక్కో బస్తాపై రూ 50 నుంచి 330 వరకు పెరిగింది. అదే క్రమంలో నవంబర్‌లో రూ 50 నుంచి రూ 100 వరకు, జనవరిలో యాసంగికి ముందే రూ 50 వరకు పెంచారు. ప్రస్తుతం కాంప్లెక్స్‌, పొటాష్‌ చెరువులపై రూ 225 నుంచి రూ 300 వరకు ధరలు పెరిగాయి. ప్రస్తుతం పెరిగిన కాంప్లెక్స్‌, పొటాష్‌ ఎరువుల ధరలతో జిల్లా రైతులపై అదనంగా వానకాలం సీజన్లో రూ 10 కోట్ల వరకు భారం పడనుంది. ప్రస్తుతం 20:20:0:13 ఎరువుల బస్తాపై రూ300 వరకు పెరిగింది. పాత ధర రూ.1500 ఉండగా ప్రస్తుతం రూ 1800 చేరింది. 19:19:19 ఎరువులపై రూ 225 పెరిగింది. పాత ధర రూ 2075 ఉండగా కొత్త ధర రూ 2300 చేరింది. 12:32:16 బస్తాపై రూ 225 పెరుగగా పాత ధర రూ 2025 నుంచి రూ 2250 చేరింది. 14:35:14 ఎరువు ధర కూడా రూ 2175 నుంచి రూ 2250 చేరింది. పొటాష్‌ మాత్రం రూ 125 పెరిగింది. పాత ధర రూ 1850 ఉండగా కొత్త ధర 1975 చేరింది. డీఏపీ బస్తా రూ 1350, యూరియా బస్తా రూ 266.50 ఇస్తున్నారు. వీటిపై కూడా ధరలు పెరిగిన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తోంది. యాసంగి సీజన్‌తో పోలిస్తే వానాకాలం సీజన్లో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు నాలుగు బస్తాల వరకు, రెండు మూడు రకాల కాంప్లెక్స్‌ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అరబస్తా వరకు పోటాష్‌ వినియోగిస్తుంటారు. దీంతో వానాకాలం సీజన్‌లో ఎరువుల భారంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

యాభై శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట

జిల్లాలో వానాకాలం సీజన్‌ సంబంధించి రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువులను అందజేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. జిల్లా రైతులకు జీలుగా ప్రతి కిలో రూ.163.50 కాగా సబ్సిడీ మినహాయించి రూ 81.75 ఇస్తారు. 30 కిలోల జీలుగ బ్యాగుకు రూ.2452.50 చెల్లించాల్సి ఉంటుంది. జనుము కిలో రూ.155.50 ఉండగా, సబ్సిడీ మినహాయించి రూ 77.75 రైతు చెల్లించాల్సి ఉంటుంది. 40 కిలోల బ్యాగుకు రూ 3110 చెల్లిస్తే సరిపోతుంది.

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు కావాల్సిన ఎరువులు(మెట్రిక్‌ టన్నులు)

మండలం యూరియా డీఎపీ ఎన్‌పీకేఎస్‌ ఎంవోపీ ఎస్‌ఎస్‌పీ

గంభీరావుపేట 2200 200 1700 450 80

ఇల్లంతకుంట 3950 400 3600 600 120

ముస్తాబాద్‌ 2900 400 2600 250 50

సిరిసిల్ల 650 60 550 100 20

తంగళ్లపల్లి 2100 280 2100 460 80

వీర్నపల్లి 1024 90 860 150 25

ఎల్లారెడ్డిపేట 2200 700 1800 550 100

బోయినపల్లి 2500 750 2200 400 50

చందుర్తి 2200 210 2100 330 70

కోనరావుపేట 2500 310 1700 400 70

రుద్రంగి 1120 110 1080 155 30

వేములవాడ 1040 110 1020 140 25

వేములవాడ రూరల్‌ 1560 140 1400 240 40

---------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 25944 3760 22710 4225 760

---------------------------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - May 23 , 2026 | 01:05 AM