రాజన్న ఆలయ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:39 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి 2027 నూతన క్యాలెండర్‌ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు.
వేములవాడ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి 2027 నూతన క్యాలెండర్‌ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. శుక్రవారం ఉదయం భీమేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసిన ఆది శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు స్వస్తి వచనాలతో ఘనస్వా గతం పలికారు. శ్రీస్వామి వారి ప్రత్యేక అభిషేక పూజలో పాల్గొన్న అనం తరం ఆలయ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా ఆల య ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్ కుమార్ శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరుపున భక్తులకు అందజేసేందుకు ఒక్కో క్యాలెండర్‌ను రూ.100కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రాజన్న ఆల య క్యాలెండర్‌లో నక్షత్రాలు, ఏకాదశి తిథులు, ఉగాది పండుగ ముహూ ర్తాలతో పాటు ఆలయానికి సంబంధించిన సమగ్ర సమాచారం, పూజ వివరాలు పొందుపరిచారని తెలిపారు. క్యాలెండర్ ప్రాముఖ్యతను తెలియ జేస్తూ మొదటి 21 క్యాలెండర్‌లను ఆది శ్రీనివాస్ కొనుగోలు చేశారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ కౌన్సిలర్లు, ఆల య ఉద్యోగులు ఉన్నారు.