Share News

అకాల వర్షం..

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:17 AM

జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేసింది. ఈదురు గాలులతో మొదలైన వర్షం ఉధృతరూపం దాల్చింది. దీంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రాత్రి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రజలు ఇబ్బందిపడ్డారు.

అకాల వర్షం..
చొప్పదండిలో నేలవాలిన మొక్కజొన్న

జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేసింది. ఈదురు గాలులతో మొదలైన వర్షం ఉధృతరూపం దాల్చింది. దీంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రాత్రి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రజలు ఇబ్బందిపడ్డారు.

ఫ చొప్పదండి: మండలంలో మంగళవారం వేకువ జామున ఈదురుగాలులు వీచాయి. స్వల్పంగా వర్షం కురవగా గాలులకు అక్కడక్కడ మొక్కజొన్న పంట నేలవాలింది. మరికొద్ది రోజుల్లో పంట చేతికి అందే సమయంలో మొక్కజొన్న పంటలకు నష్టం కలిగింది.

ఫ గన్నేరువరం: మండలంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి, ఈదురుగాలులకు మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. మాధాపూర్‌లో పలువురు రైతులకు చెందిన మొక్కజొన్న పంట నేలవాలింది. మాదాపూర్‌లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. మామిడికాయలు రాలిపోయాయి. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే క్రమంలో అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్‌లో నష్టపోయిన పంటలను స్థానిక సర్పంచ్‌ పరిశీలించారు. అధికారులు నష్టపోయిన పంటలను వెంటనే నమోదు చేసి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ఆయన కోరారు.

ఫ ఇల్లందకుంట: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి మొక్కజొన్న నేలకొరిగింది. మండలంలో 7,230 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. చేతికి వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ కరీంగనర్‌ రూరల్‌: అకాల వర్షం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. బొమ్మకల్‌లో మంద తిరుపతికి చెందిన రెండెకరాల మొక్కజొన్న, నగునూర్‌ గ్రామానికి చెందిన తాటి కొండ వెంకటమ్మకు చెందిన ఎకరం మొక్కజొన్న నేల వాలింది.

Updated Date - Apr 01 , 2026 | 12:17 AM