సమస్యలను పట్టించుకోని యూనియన్లు
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:20 AM
టీఎస్‌ఆర్టీసీలో అధికారం లో ఉన్న గత యూనియన్లు కార్మికల సమస్యలను గాలికొదిలేశాయని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈ వెంకన్న అన్నా రు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : టీఎస్‌ఆర్టీసీలో అధికారం లో ఉన్న గత యూనియన్లు కార్మికల సమస్యలను గాలికొదిలేశాయని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈ వెంకన్న అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ కార్యదర్శి కే కొమరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిరిసిల్ల డిపో నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. చైర్మన్‌గా కే నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రమేష్, అధ్యక్షుడు సిహెచ్ బాణయ్య, ఉపాధ్య క్షులు నర్సయ్య, విఠల్, రఘ, శంకర్, కార్యదర్శి జేఎస్‌ఎన్‌రావ్, సహా య కార్యదర్శి వీ రాజేందర్, సంయుక్త కార్యదర్శులు వీ దేవయ్య, ఏ మల్లికార్జున్, ఏ శంకర్‌రావు, ఆర్ నర్సయ్య, కార్యనిర్వాహక కార్యదర్శు లు ఆర్‌ఆర్ చంద్రయ్య, జీ యాదగిరి, అశోక్, రాములు, దేవేందర్, సంపత్, కోశాధికారి పీ బాబు, ముఖ్య సలహాదారులు బాలరాజు, నర్సింగం, పీ తిరుపతి, రాజు, ఇబ్రయిం, జీ తిరుపతి ఎన్నుకున్నారు. అదే విధంగా డిపో గ్యారేజీ, మహిళ విభాగం నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంను నాయకులు అభినందించారు. అనంతరం సిరిసిల్ల ఆర్టీసీ డిపో పక్కన యూనియన్ జెండాను యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న ఎగరవేశారు. నూతన కార్యవర్గం తో కలిసి డిపో మేనేజర్ ప్రకాశ్‌రావును సన్మానించారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట కార్మికు లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడారు. రాష్ట్రంలో ని గుర్తింపు పొందిన ఆర్టీసీ యూనియన్‌ల ఎన్నికల ప్రక్రియ మొదలైం దని అందులో భాగంగా గుర్తింపు పొందిన రాష్ట్ర ఎంప్లాయీస్ యూని యన్ సిరిసిల్ల ఆర్టీసీ డిపో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడేం దుకు ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం సిద్ధంగా ఉందని, కార్మి కులు అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో హక్కుల సాధన కోసం కార్మికులు వీరోచితంగా పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని ఒప్పించిన డిమాండ్లు అమలు కావడం లేదని ఆరోపించారు. మూడు రోజుల సమ్మెతో ప్రధానమైన డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రత, వేతన సవరణనను ప్రభుత్వంను ఒప్పించామన్నారు. గత పాలకులు రద్దు చేసిన ఆర్టీసీ కార్మికుల సంఘాలను పోరాటాలతో తిరిగి ఈ ప్రభుత్వంతో పునరుద్ధ రింపజేసుకున్నామన్నారు. గతంలో అధికారంలో ఉన్న కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలను గాలికొదిలేశాయని, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కార్మికులను ప్రభుత్వానికి, యాజమాన్యాలకు తాఖట్టు పెట్టాయ ని ఆగ్రహాం వ్యక్తం చేశారు. 2024 నుంచి అసాధ్యం అనుకున్నవి సుసా ధ్యం చేసి కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా ఎంప్లాయీస్ యూనియన్ నిలిచిందని, రానున్న రోజులలో కార్మికుల హక్కుల కోసం ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ యాజమాన్యం ఉన్న కార్మికుల పక్షాన పోరాటాలు చేసి వారి హక్కులను సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం కాళిదాస్, డిపో నాయకు లు, కార్మికులు పాల్గొన్నారు.