రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న కేంద్ర మంత్రులు
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:55 PM
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నా రని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ఆరోపించారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నా రని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద రాహుల్‌గాంధీ, ఖార్గే చిత్రపటానికి క్షీరా భిషేకం చేశారు. అనంతరం ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరస న వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర దేవరాజు, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య మాట్లాడారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్స్ పాలసీని ప్రారంభించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానంతో లోక్‌సభ ఎంపీ రాహుల్‌గాంధీ వచ్చారన్నారు. రాష్ట్రంలో గ్లోబల్ సదస్సులను నిర్వ హిస్తూ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. పెట్టుబడులను పెట్టడానికి వచ్చే విదేశీ ప్రతినిధులను అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వీసాలను రద్దు చేయడానికి కుట్రలు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర, జిల్లా బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం గిగ్ వర్కర్స్ పాలసీ ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ నేతలు తెలం గాణకు విదేశీ పెట్టుబడులు రాకుండా,యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుం టున్నారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకులను క్షమించబోరని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, పట్టణ ఉపా ధ్యక్షుడు బొప్ప దేవయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాల రాజు, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు కొలనూరి రమాదేవి, నాయకులు రాగుల రాములు, కంసాల మల్లేశం, బూర యాదగిరి, పత్తిపాక లక్ష్మీరాజం, బైరి ప్రభాకర్, ఇప్పపూల లక్ష్మణ్, శ్రీనివాస్, మల్లేశం, ప్రసాద్, వెంకటేశం, ఎర్రం మల్లయ్య, మండల సత్యం, సత్తయ్య, రియాజ్, అఫ్రోజ్, రమేష్ పాల్గొన్నారు.