Share News

కేంద్ర మంత్రి రాజీనామా విద్యార్థుల విజయం

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:34 AM

నీట్‌ పరీక్ష లీకేజీపై దేశ వ్యాప్త ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్థులు, యువత విజయం అని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

కేంద్ర మంత్రి రాజీనామా విద్యార్థుల విజయం

సిరిసిల్ల టౌన్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : నీట్‌ పరీక్ష లీకేజీపై దేశ వ్యాప్త ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్థులు, యువత విజయం అని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆగయ్య మాట్లాడారు. ఢీల్లీ జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు నిరసనలు చేపట్టగా కేంద్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జీ చేసి దమనకాండకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత బలవంతుడనని విర్రవీగాడని, నీట్‌ పరీక్ష లీకేజీతో నష్టపోయిన విద్యార్థులు ఆందోళనతో రోడ్డెక్కడంతో దిగివచ్చాడని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో ద్వారా విద్యార్థులకు క్షమాపణ చెప్పి నీట్‌ లీకేజీపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఇక నుంచి పరీక్షల లీకేజీకి పాల్పడితే బాధ్యులపై చట్టపరంగా పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానాలు విధిస్తామని ప్రకటించడం దేశ విద్యార్థులకు, యువతకు శుభసూచకం అన్నారు. బడేమియా చోటేమియాలు రేవంత్‌రెడ్డి, బండి సంజ య్‌లు వ్యవహరిస్తున్నారన్నారు. కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని ఖండించారు. కరీంనగర్‌ నడి బొడ్డును దొంగతనాలు, హింసాత్మకమైన సంఘటనలు జరుగుతున్నాయని, దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశ అభివృద్ధి కార్యక్ర మాలపై బండి సంజయ్‌ దృష్టి సారించాలన్నారు. దేశ యువతను ఆకుట్టుకున్న కేటీఆర్‌పై విమర్శలు చేయడం వల్ల ప్రజల ముందు మరింత దిగజారిపోతాడని అన్నారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేపట్టిన ధర్నాకు తరలివచ్చిన విద్యార్థులు, యువతకు కృతజ్ఞతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి కౌన్సిలర్లు, ప్రధాన కార్యదర్శి మాన్య రవి, కౌన్సిలర్లు బూర బాలు, వేముల రాములు, మాజీ కౌన్సిలర్లు గుండ్లపెల్లి పూర్ణచందర్‌, గెంట్యాల శ్రీనివాస్‌, నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, కుంభాల మల్లారెడ్డి, లింగంపల్లి మధుకర్‌, పంగ రవి, కొండ శ్రీని వాస్‌, అడిచర్ల సాయి పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:34 AM