భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:32 AM
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీం నగర్-చైతన్యపురి, మహాశక్తి ఆలయ నిర్వాహకులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం భవానీ దీక్ష చేపట్టారు.
కరీంనగర్ కల్చరల్ అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీం నగర్-చైతన్యపురి, మహాశక్తి ఆలయ నిర్వాహకులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం భవానీ దీక్ష చేపట్టారు. ఎంపీగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రస్తుత కేంద్ర మంత్రిగా నిత్యం బిజీగా గడిపే ఆయన గత 16 సంవత్సరాలుగా దీక్ష కొనసాగిస్తున్నారు. 2011లో తొలిసారి దీక్ష చేపట్టారు. సామాన్య భక్తునిలా ఉంటూ 11 రోజుల పాటు రాజకీయాలకు దూరంగా అమ్మవార్ల సేవకే అంకితమ వనున్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం మంత్రిని కలిసేందుకు వచ్చే వారిని ఆయన ఆలయంలోనే కలుసుకుంటారని ఆయన సహాయకులు పేర్కొన్నారు. ప్రతిరోజూ, అల్పాహారం, అన్నప్రసాద వితరణలో భాగంగా ఆయన భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా కృషిచేస్తున్న ప్రధాని మోదీకి మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వేలాది మంది దీక్షలను స్వీకరించారు.