కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ రాజీనామా చేయాలి
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:07 AM
జెఫ్రీ ఎఫ్టోస్టన్ వ్యవహారంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీఫ్‌సింగ్ పూరి వెంటనే రాజీ నామా చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనితనళినీ కాంత్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : జెఫ్రీ ఎఫ్టోస్టన్ వ్యవహారంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీఫ్‌సింగ్ పూరి వెంటనే రాజీ నామా చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనితనళినీ కాంత్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఈ మేరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులపై జరిగిన శారీరక, మానసిక వేధింపులను, అదేవిధంగా అన్యాయాన్ని ప్రశ్నించిన యువజన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి వేధింపులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులను భేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జెఫ్రీ ఎప్టోస్టన్ వ్యవహారంలోని పలు అంశాలపై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంగళ లీల, ఆడెపు చంద్రకళ, సుల్తానా, మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోడం అరుణ, ఉపాధ్యక్షురాలు రోజ, జయలక్ష్మి, పలువురు మహిళలు పాల్గొన్నారు.