ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:13 AM
మారుతున్న పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటలీ జెన్స్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : మారుతున్న పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటలీ జెన్స్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మల్లారం గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధుని క సాంకేతికతను విద్యార్థులకు చేరవేసే కార్యక్రమాలు వారి భవిష్య త్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడు తాయన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహా లో విద్యా ప్రమాణాలను పెంచుతూ నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేములవాడ నియోజకవర్గంలో కొండప్రోలులో తెలంగాణ పబ్లిక్ స్కూ ల్‌ను తీసుకవచ్చామన్నారు. లక్షల్లో ఫీజులు చెల్లించే భారం తప్పిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను 40శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200శాతం పెంచి విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మారు తున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తామ న్నారు. విద్యాభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పనలో ప్రజాప్రతినిధు లు, విద్యాశాఖ అధికారులు గ్రామస్థులు సమస్వయంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగం అర్పితవీరారెడ్డి, ప్యాక్స్ చైర్మన్ వకులాభరణం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సామ తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోయినేని కరుణా కర్, ఎంఈవో కిషన్ తదితరులు పాల్గొన్నారు.