Share News

స్వశక్తి మహిళలకు ‘ఉల్లాస్‌’ పరీక్ష

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:19 AM

స్వశక్తి సంఘాల్లోని మహిళా నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించి తీర్చిదిద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్‌ కార్యక్రమాన్ని నాలుగు నెలల క్రితం ప్రారంభించింది.

స్వశక్తి మహిళలకు ‘ఉల్లాస్‌’ పరీక్ష

సిరిసిల్ల, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : స్వశక్తి సంఘాల్లోని మహిళా నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించి తీర్చిదిద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్‌ కార్యక్రమాన్ని నాలుగు నెలల క్రితం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు అక్షరమాల పేరిట మహిళలకు విద్య ను అందించేందుకు శ్రీకారం చుట్టింది. డీఆర్‌డీఏ, మెప్మా, ఐకేపీ ఆధ్వర్యం లో 23,375 మంది మహిళా నిరక్షరాస్యులను గుర్తించారు. వీరికి అక్ష రాలు నేర్పించే విధంగా వలంటరీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అక్ష రాలు నేర్చుకున్న మహిళ నిరక్షరాస్యుల్లో ఎంత మేరకు అమ్మకు అక్షర మాల కార్యక్రమం ఉపయోగపడిందని దానిపై ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీల పరిధిలోనే ఎన్‌ఐవోఎస్‌ పరీక్షను నిర్వ హించారు. ఐకేపీ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో జరిగిన పరీక్ష లకు జిల్లాలో 12,856 మంది మహిళలు హాజరయ్యారు.

Updated Date - Mar 30 , 2026 | 12:19 AM