Share News

వైభవంగా ఉగాది వేడుకలు

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:42 AM

తెలుగు లోగిళ్లు కొంగొత్త ఆశలతో పరాభవ నామ సంవత్సరాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సంతోషాల మధ్య ఆహ్వానించారు.

వైభవంగా ఉగాది వేడుకలు

సిరిసిల్ల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తెలుగు లోగిళ్లు కొంగొత్త ఆశలతో పరాభవ నామ సంవత్సరాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సంతోషాల మధ్య ఆహ్వానించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఉగాది పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకు న్నారు. జిల్లాలోని వేములవాడ భీమేశ్వర ఆలయంతో పాటు వివిధ ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో దైవదర్శనాలు చేసుకున్నారు, మామిడి తోరణాలు, పూల అలంకరణలతో ఇళ్లను శోభాయమానంగా కళకళాడాయి. షడ్రుచుల పచ్చడి, ఘుమఘు మలాడే పిండి వంటలతో కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉగాది పండుగను సంబరంగా జరుపుకున్నారు. జిల్లాలోని కాం గ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ,ఇతర పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు. బంధువులు, స్నేహితులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని పచ్చడని అందించారు.

అన్నదాత, నేతన్నలకు సానుకుల కాలం

శ్రీ పరాభవ నామ సంవత్సరములు రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారని, సస్యానుకూల వర్షాలు కురవ డంతో పంటలు బాగా పండుతాయని, నేతన్నలకు చేతినిండా పనితో శుభప్రదంగా ఉంటుందని పంచాంగ శ్రవణంలో పండితులు వివరిం చారు. జిల్లాలోని దేవాలయాల్లో ఎంతో ఉల్లాసంగా పంచాంగ శ్రవణా లు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో శ్రీ మార్కండేయ, శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి, వాసవి కన్యకాపరమేశ్వరి, హనుమాన్‌ దేవాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరిగాయి. సిరిసిల్ల మార్కండేయ దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను పంచాంగ శ్రవణం ద్వారా వేదపండితులు వివరించారు. వేదపండితులు కోడూరి విజయ్‌భాస్కర్‌, కోడూరి రవీందర్‌, పాశికంటి కృష్ణహారి, ఆడేపు హరీష్‌ ఎక్కల్‌దేవి నారాయణలు రాశిఫలాలను వివ రించారు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఫలాలకు సం బంధించినవి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీపరాభవ నామ సంవత్స రంలో మంచి ఫలితాలు ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా పడుతాయని సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతారని తెలిపారు. పంచాంగ శ్రవ ణంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, పద్మశాలి సం ఘం అధ్యక్షుడు దూడం శంకర్‌, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధు లు, పద్మశాలి సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు. సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో వేద పండితులు రేపాక రాజుశర్మలు పంచాంగ శ్రవణం చేశారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్‌, ఇతర దేవాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవ ణాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:42 AM