Share News

ఘనంగా ఉగాది వేడుకలు

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:12 AM

జగిత్యాల టౌన్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, గుట్టరాజేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, విద్యానగర్‌, ధరూర్‌ క్యాంపు శ్రీరామ ఆలయాలు, భక్తమర్కండేయా, మడేలేశ్వర స్వామి ఆలయం, బ్రహ్మణవీధిలోని హరిహర ఆలయం, కరీంనగర్‌ రోడ్డులో గణేష మందిరం, షిరిడి సాయిబాబా మందిరాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు.

ఘనంగా ఉగాది వేడుకలు
కొండగట్టులో పంచాంగ శ్రావణం చేస్తున్న అర్చకులు, పాల్గొన్న ఎమ్మెల్యే సత్యం

జగిత్యాల టౌన్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, గుట్టరాజేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, విద్యానగర్‌, ధరూర్‌ క్యాంపు శ్రీరామ ఆలయాలు, భక్తమర్కండేయా, మడేలేశ్వర స్వామి ఆలయం, బ్రహ్మణవీధిలోని హరిహర ఆలయం, కరీంనగర్‌ రోడ్డులో గణేష మందిరం, షిరిడి సాయిబాబా మందిరాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీమాన్‌ నంబి వేణుగోపాల స్వామి పంచాంగ శ్రవణం చేసి నూతన పంచాంగాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఫజగిత్యాల మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌ కౌన్సిలర్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ పండితులు శ్రీమాన్‌ నంబివేణుగోపాల చార్య కౌశిక పంచాంగ శ్రవణ నిర్వహించారు.

ఫవెలమ సంక్షేమ మండల ఆధ్వర్యంలో పద్మనాయక కళ్యాణ మంటపంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా గెలుపొందిన వెలమ సమాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈసందర్భంగా వేద పండితులు తిగుళ్ల విషుశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు అయిల్నేని సాగర్‌ రావు, ముప్పాల రాంచందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

ఫమున్నూరు కాపుసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌, మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత్‌ సురేష్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా మున్నూరు కాపు సంఘం సభ్యులకు, పట్టణ ప్రజలకు ఉగాది పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌, మాజి జడ్పి చైర్‌ పర్సన్‌ దావ వసంత సురేష్‌, కౌన్సిల్‌ సభ్యులు చీటి లక్ష్మినారాయణ, కూతురు రాజేష్‌ కూతురు శేఖర్‌, పిట్ట ధర్మరాజు, కొక్కు గంగాధర్‌, తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్లను సన్మానించారు.

ఫటిఎస్‌జిఆర్‌ఈఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేసి ఉగాది పచ్చడి పంపిణి చేశారు. ధరూర్‌ క్యాంపు వాకర్స్‌ ఆసోసియేషన్‌, ఎస్‌కెఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల వాకర్‌ ఆసోషియేషన్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కాలనీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు.

Updated Date - Mar 20 , 2026 | 12:12 AM