కమిషనరేట్‌కు రెండు పోలీస్ డాగ్స్
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:22 AM
నేర పరిశోధనలో మరింత వేగం పెంచేందుకు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు కమిషనరేట్ విభాగంలోకి రెండు పోలీస్ డాగ్స్ చేరాయి. రోలెక్స్ (ట్రాకర్), మ్యాక్స్ (స్నిఫర్) సోమవారం కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశాయి.
కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : నేర పరిశోధనలో మరింత వేగం పెంచేందుకు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు కమిషనరేట్ విభాగంలోకి రెండు పోలీస్ డాగ్స్ చేరాయి. రోలెక్స్ (ట్రాకర్), మ్యాక్స్ (స్నిఫర్) సోమవారం కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశాయి. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఐఐటీఏ కేంద్రంలో ఈ డాగ్స్‌కు తొమ్మిది నెలలపాటు కఠినమైన, అత్యుత్తమ స్థాయి శిక్షణ అందించారన్నారు.
ఫ నేరస్థుల ఆటకట్టించే ‘రోలెక్స్’
రోలెక్స్ డాగ్ ట్రాకర్ విభాగంలో శిక్షణ పొందింది. దీనికి హ్యాండ్లర్‌గా కానిస్టేబుల్ బి నితిన్ ఉన్నారు. ఇది నేరస్తుల అడుగుజాడలను గుర్తించడం, నేర పరిశోధనలు, క్లూస్ టీమ్ తనిఖీలలో కీలక పాత్ర పోషిస్తుంది. శిక్షణలో రాష్ట్ర స్థాయిలో ఈ జాగిలం ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో బంగారు పతకం, నేరస్థులను ట్రాక్ చేయడంలో కాంస్య పతకం సాధించింది. ఈ పతకాలను సీపీ ప్రదానం చేసారు.
ఫ పేలు పదార్థాలను పసిగట్టే ‘మ్యాక్స్’
మ్యాక్స్ డాగ్ స్నిఫర్ విభాగంలో శిక్షణ పొందింది. దీనికి హ్యాండ్లర్‌గా కానిస్టేబుల్ పవన్‌కుమార్ ఉన్నారు. ఇది పేలుడు పదార్థాలు, ఇతర నిషేధిత వస్తువులను పసిగట్టడంలో సహాయపడుతుంది. వీఐపీ భద్రత, వివిధ రకాల ఆపరేషన్లలో ఈ పోలీస్ డాగ్‌ను వినియోగిస్తామని ిసీపీ తెలిపారు.
ఫ పోలీస్ డాగ్ ‘టైసన్’కు బంగారు పతకం
హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఐఐటీఏ శిక్షణ కేంద్రంలో జరిగిన 24వ బ్యాచ్ ముగింపు వేడుకల్లో కరీంనగర్ పోలీస్ విభాగానికి చెందిన ‘టైసన్’ అనే పోలీస్ డాగ్ బంగారు పతకం సాధించింది. ఎక్స్‌ప్లోజివ్స్ (పేలుడు పదార్థాల గుర్తింపు) విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ మెడల్ లభించింది. ఈ ఘనత సాధించిన టైసన్‌ను, దాని హ్యాండ్లర్ కానిస్టేబుల్ రాజును సీపీ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రజినీకాంత్, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి మహేందర్ పాల్గొన్నారు.