Share News

తుంగతుర్తి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలి

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:06 AM

హిందూ ద్రోహి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ క్షమాపణలు చెప్పాలని అఖిల బ్రహ్మణ సేవా సం ఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలి
నిరసన తెలుపుతున్న బ్రాహ్మణ సంఘం నాయకులు

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్‌

జగిత్యాల టౌన్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హిందూ ద్రోహి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ క్షమాపణలు చెప్పాలని అఖిల బ్రహ్మణ సేవా సం ఘం నాయకులు డిమాండ్‌ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్‌ చౌర స్తాలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మం దుల సామేల్‌ చిత్రపటాన్ని చీపుర్లతో కొట్టి దహనం చేశారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎస్సీ సెల్‌ చైర్మన్‌గా పదవీ ప్రమాణ స్వీకారం జరిగిన సభలో బ్రహ్మణులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ వేద ఆశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌ బ్రాహ్మణులపై బూతు పదాలు వాడినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో ఆది జాంబవ పరియోజన ప్రాంత ప్రముఖ్‌ అలగుర్తి లక్ష్మినారా యణ, బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు మోతే ఉమాకాంత్‌ శర్మ, సిరిసిల్ల రాజేం దర్‌ శర్మ, సరేష్‌ శర్మ, సంగనబట్ల గుండయ్య శర్మ, మేడిపల్లి శ్రీనివాస్‌ శర్మ, నేరళ్ల శ్రీనివాస చారి, మెట్ట కిరణ్‌ భాస్కర్‌ శర్మ, కొత్తపల్లి శ్రీనివాస శర్మ, గుండి శ్రీనివాస శర్మ, కొత్తపల్లి రాజశేఖర్‌, రుద్రంగి రాఘవేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 01:06 AM