పారదర్శకంగా ‘చేయూత’ వెరిఫికేషన్
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:27 AM
చేయూత పెన్షన్ వెరిఫికేషన్‌ను పారదర్శకంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చేయూత పెన్షన్ వెరిఫికేషన్‌ను పారదర్శకంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని చేపడుతున్న చేయూత పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియను కాశ్మీరుగడ్డ, ముకరంపుర తదితర ప్రాంతాల్లో సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమిషనర్ దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు సేకరిస్తున్న వివరాలు, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. వెరిఫికేషన్ దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు. వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను గుర్తించడానికి ఏ ప్రమాణాలు ఉపయోగిస్తున్నారనే కోణంలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ వెరిఫికేషన్‌లో ఎలాంటి లోపాలు, తప్పులు, పొరపాట్లు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తుల విచారణ చేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి భూమానందం, ఆర్‌ఐలు, టౌన్‌ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.