Share News

బ్యాంకు ఖాతాదారులకు పారదర్శక సేవలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:18 AM

పారదర్శకంగా ఖాతాదా రులకు సేవలు అందిస్తున్నామని, బ్యాంకు డిపాజిట్లు రూ 140.04 కోట్లకు చేరుకుందని గడిచిన 26మాసాల్లోనే రూ.45 కోట్ల డిపాజిట్లు పెరిగినట్లు సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనా రాయణ తెలిపారు.

బ్యాంకు ఖాతాదారులకు పారదర్శక సేవలు

సిరిసిల్ల, సెప్టెంబరు 21(ఆంరఽధజ్యోతి): పారదర్శకంగా ఖాతాదా రులకు సేవలు అందిస్తున్నామని, బ్యాంకు డిపాజిట్లు రూ 140.04 కోట్లకు చేరుకుందని గడిచిన 26మాసాల్లోనే రూ.45 కోట్ల డిపాజిట్లు పెరిగినట్లు సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనా రాయణ తెలిపారు. సోమవారం సిరిసిల్ల పద్మశాలి కళ్యాణ భవన్‌ లో సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంక్‌ 40వ వార్షిక మహాసభ జరిగిం ది. 2026-27సంవత్సరానికి రూ.14.50కోట్ల అంచనా బడ్జెట్‌ను సభ్యు ల ఆమోదించారు. బ్యాంకు వార్షిక నివేదికను సీఈవో పతిపాక శ్రీని వాస్‌ ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా చైర్మన్‌ లక్ష్మీనారాయణ మాట్లా డుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఫోన్‌ పే, గూగుల్‌పే, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి యూపీఐ సేవలు అందుబా టులోకి తెచ్చామని తెలిపారు. సభ్యులకు వాటాదనంపై 14 శాతం డివిడెంట్‌ ఇవ్వడానికి పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. బ్యాం కు ద్వారా రూ.86.82 కోట్ల అప్పులు నిల్వ ఉన్నాయని అన్నారు. ఖాతా దారులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అందిస్తున్నా మని, దీని ద్వారా 395 మందికి ప్రమాద బీమా రు 2 లక్షల చొప్పున, జీవనజ్యోతి బీమా యోజన ద్వారా 56 మంది రూ 2 లక్షల బీమా సౌకర్యం వినియోగించుకున్నారని తెలిపారు. త్వరలోనే వేములవాడ, కరీంనగర్‌లో బ్యాంకు బ్రాంచీలు ప్రారంభించినట్లు తెలిపారు.బ్యాంకు మాజీ చైర్మన్లు గూడూరి ప్రవీణ్‌, గాజుల నారాయణ, గాజుల బాల య్యలు బ్యాంక్‌ అభివృద్ధికి పాలకవర్గం చేస్తున్న కృషిని అభినం దించారు. సభ్యులు గుండ్లపల్లి శ్రీనివాస్‌, బియ్యంకార్‌ శ్రీనివాస్‌, కట కం సంతోష్‌, సిరిగిరి శంకర్‌లు ప్రతిపాదించిన అంశాలను చర్చిం చారు. సభలో బ్యాంక్‌ ఉపాధ్యక్షుడు అడ్డగట్ల మురళి, గుడ్ల సత్యా నందం, చొప్పదండి ప్రమోద్‌, పాటి కుమార్‌ రాజు, బుర్ర రాజు గౌడ్‌, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాస్‌, ఎనగందుల శంకర్‌, వలస హరిణి, పత్తిపాక సురేష్‌, కోడం సంజీవ్‌, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ బి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 01:18 AM