పారదర్శకంగా చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:47 AM
చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో చేయూత పెన్ష న్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి దరఖా స్తుల క్షేత్రస్థాయి పరిశీలన పకడ్బందీగా చేపట్టడం, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 25 వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చేయూత పెన్షన్ల కోసం వచ్చిన ప్రతి దర ఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖా స్తుదారుల నివాస స్థితి, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పెన్షన్ కేటగిరీ, అర్హత ప్రమాణాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాలని ఆదేశించారు. అర్హత ఉన్న దరఖాస్తులను స్పష్టంగా గుర్తించడంతో పాటు, అనర్హత ఉన్న దరఖాస్తులకు నిర్దిష్ట కారణాన్ని చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వితం తువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమి యా, సికిల్ సెల్, హిమోఫీలియా, గీతకార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ సంబంధించిన ఏడు రకాల దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలు అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. వితంతు మహిళల కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు అయితే గ్రామాల్లో 30 ఏండ్ల వయస్సు, పట్టణాల్లో 50 ఏండ్ల వయస్సు ఉండాలని స్పష్టం చేశారు. వీరికి సంబంధిత పంచాయతీ కార్య దర్శి, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు ధృవీకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గీత కార్మికులు 50 ఏండ్ల వయస్సు, ఎక్సైజ్ శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రంతో పాటు, గీత కార్మికుల సొసైటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. నేత కార్మికులు 50 ఏండ్ల వయసు ఉండాలని, హ్యాం డ్లూమ్ టెక్స్‌టైల్ శాఖ వారి గుర్తిం పు పత్రం ఉండాలని తెలిపారు. పైలేరియా బాధితులు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రం ఉండాలని, డయాలసిస్ బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వివరాలు ఉండాలని సూచించారు. దివ్యాంగులకు సదరం శిబిరం ద్వారా మంజూరు అయి న 40 శాతం వైకల్య ధ్రువీకరణ యూడీఐడీ పత్రం, చెవిటి వారికి 51 శాతం వైకల్య ధ్రువీకరణ యూడీఐడీ పత్రం ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదా రుడికి చేయూత పెన్షన్ ప్రయోజనం అందేలా పరిశీల న ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హీమశ్రీ, చేనేత జౌలి శాఖ ఏడి సంతోష్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ తది తరులు పాల్గొన్నారు.