Share News

పారదర్శకంగా భూముల రీసర్వే ప్రక్రియ

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:17 AM

జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రి యను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూ ల వాతావరణంలో పకడ్బందీగా పారదర్శ కంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశిం చారు.

పారదర్శకంగా భూముల రీసర్వే ప్రక్రియ

సిరిసిల్ల అర్బన్‌, నవంబరు 11 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రి యను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూ ల వాతావరణంలో పకడ్బందీగా పారదర్శ కంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి భూముల రీసర్వేపై మం త్రి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీక్షిం చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ భూముల రీసర్వే ప్రక్రియపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించామ న్నారు. రీసర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా యో తెలుసుకునేందుకు గ్రౌండ్‌ రిపోర్టులను సేకరి స్తున్నామని పేర్కొన్నారు. రీసర్వే సందర్భంగా ఎదుర వుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు. భూముల రీసర్వేకు సంబంధించి రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎస్‌ఓపీ)ను అధికారులు పక్కా గా అమలు చేయాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థా యి నివేదికల ఆధారంగా అవసరమైన మారుఁలు, సవరణలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు ఉండాలని స్పష్టం చేశారు. నవంబర్‌ నెలాఖరులోగా జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రీ సర్వే పనుల్లో అధికారులు పూర్తి బాధ్యతతో, చిత్తశు ద్ధితో వ్యవహరించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ ర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

సర్వే బృందాల ఏర్పాటు చేయాలి

ప్రతి మండలంలో రీసర్వే కోసం అవసరమైన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న లైసెన్స్‌డ్‌ సర్వే యర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల ని సూచించారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని, ఈమేరకు కలెక్టర్‌ ముందస్తు ప్రణాళికలు రూ పొందించుకోవాలని ఆదేశించారు. రీసర్వే జరిగే సమ యంలో రైతులకు ముందు సమాచారం అందించాల ని, స్థానిక రైతుల సమక్షంలోనే సర్వే ప్రక్రియ నిర్వ హించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు భవి ష్యత్తులో భూవివాదాలు తలెత్తకుండా, రీసర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 12:18 AM