Share News

పారదర్శకంగా ‘మన ఇసుక వాహనం’ అమలు

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:34 AM

రాష్ట్ర ప్రభుత్వ అదేశాలకు అనుగు ణంగా ఇసుక తరలింపులో పారదర్శకత కోసం మన ఇసుక వాహనం అమలు చేస్తున్నామని అదనపు గడ్డం నగేష్‌ తెలిపారు.

పారదర్శకంగా ‘మన ఇసుక వాహనం’ అమలు

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వ అదేశాలకు అనుగు ణంగా ఇసుక తరలింపులో పారదర్శకత కోసం మన ఇసుక వాహనం అమలు చేస్తున్నామని అదనపు గడ్డం నగేష్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో గురువారం మన ఇసుక వాహనం ఆన్‌లైన్‌ విధానం, అప్లికేషన్‌ డౌన్‌లో డ్‌, ఆన్‌లైన్‌లో అనుమతులు జారీ తదితర అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటే షన్‌తో తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అఫీసరులు, గ్రామపాలన అఽధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్మాణ పనులు, ఇందిరమ్మ ఇళ్లు భవనాలు, ఇళ్లు నిర్మాణాలకు ఇసుక సెంటర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన మన ఇసుక వాహనం అప్లికేషన్‌, ఆన్‌లైన్‌ వైబ్‌సైట్‌లో నిర్మాణదారులు ఇసుక ఎలా బుక్‌ చేసుకోవాలి, డబ్బు ఎలా చెల్లిం చాలి ఇసుక ఏ రిచ్‌ నుంచి పొందాలి, ఆన్‌లైన్‌లో ఆయా అధికారులు ఇసుక అనుమతులు ఎలా జారీచేయాలో వివరించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా మన ఇసుక వాహనం ఆన్‌లైన్‌ విధా నంతోనే ఇసుక సరఫరా చేస్తామన్నారు. ఇసుక కేటాయింపు తరలింపు పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లామైనింగ్‌ అధికారి క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:34 AM