రేపు స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణ
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:54 PM
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా సర్పంచులు, మున్సిపల్ చైర్మన్, చైర్‌పర్సన్, వార్డు సభ్యులకు ఈనెల 12వ తేదీ న గురువారం శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు.
సిరిసిల్ల, మార్చి 10(ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా సర్పంచులు, మున్సిపల్ చైర్మన్, చైర్‌పర్సన్, వార్డు సభ్యులకు ఈనెల 12వ తేదీ న గురువారం శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి కె శ్రీదేవి, సెర్ప్‌సీఈవో దివ్య దేవరా జన్, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌తో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజర య్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవు తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే ఉటంకిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఏ విధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందు తాయో, ఆ కోణంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయో జిత పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే ఫోటో ప్రద ర్శనను కూడా వేదిక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఫైళ్ల క్లియరెన్స్ పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ విజయవం తంగా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్లను అభినందించారు. కొత్తగా ఎన్ని కైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణ పది థీమ్స్‌తో జరుగుతుందని, వీటికి సంబంధించిన శాఖ అధికారులు వచ్చి జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా యో, అందులో ప్రజాప్రతినిధులు పోషించాల్సిన పాత్ర గురించి స్పష్టం గా సమాచారం అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు నిర్వ హించే శిక్షణ కార్యక్రమా నికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుది ట్టంగా చేపట్టాలన్నారు. ప్రతి శాఖ నుంచి మంచి స్పీక ర్లు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించాలని పేర్కోన్నారు.
శిక్షణకు అన్ని ఏర్పాట్లు పూర్తి..
- కలెక్టర్ గరిమ అగ్రవాల్
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. మొదటి రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ వైద్య నిపుణులతో ప్రత్యేక శిబిరం నిర్వహించామని వివరించారు. అలాగే కస్తూర్బా బాలికల విద్యాలయంలో వైద్య శిబిరం, విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడి నియంత్రణకు అవగాహన కల్పించామని తెలిపారు. చందుర్తి, వేములవాడలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేసి పథకాల లబ్ధిదారుల వివరాలు, ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ వివరిం చామని స్పష్టం చేసినట్లు వివరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అన్ని జిల్లా అధికారుల కార్యాలయాల్లో స్వచ్ఛత.. పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. జిల్లాలో ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ చైర్మన్, చైర్‌పర్సన్, వార్డ్ సభ్యులకు ఈనెల 12వ తేదీన తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. శిక్షణకు హాజరుకానున్న ప్రజా ప్రతినిధులకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజుల యాక్షన్ ప్లాన్, మున్సిపల్ యాక్ట్, పంచాయతీరాజ్ యాక్ట్ ప్రభుత్వ పాలన, వివిధ పథకాలపై అవగాహన కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ మేరకు పీపీటీ ప్రదర్శన, భోజనం, స్నాక్స్ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీవో గీత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, రవాణా శాఖ అధికారి లక్ష్మ ణ్, పశు వైద్య, సంవర్ధక అధికారి రవీందర్‌రెడ్డి, సీపీవో శ్రీని వాసాచారి, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, పంచాయతీ అధికారి షర్ఫుద్దిన్, ట్రెజరీ అధికారి నవీన్ కుమార్, పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, వైద్యాధికారి రజిత, మిషన్ భగీరథ అధికారి అన్వర్, సెస్ ఎండీ బీ భిక్షపతి, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.