కుటుంబ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:26 AM
వాహనదారు లు సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరిం చడం పోలీసుల కోసం కాద ని, స్వీయ రక్షణతో పాటుగా తమ కుటుంబ సభ్యుల భద్ర త కోసం ట్రాఫిక్ నిబంధన లు తప్పకుండా పాటించాలని ఎస్పీ మహేష్ బి.గితే సూచిం చారు.
వేములవాడ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వాహనదారు లు సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరిం చడం పోలీసుల కోసం కాద ని, స్వీయ రక్షణతో పాటుగా తమ కుటుంబ సభ్యుల భద్ర త కోసం ట్రాఫిక్ నిబంధన లు తప్పకుండా పాటించాలని ఎస్పీ మహేష్ బి.గితే సూచిం చారు. అరైవ్ అలైవ్ కార్యక్ర మంలో భాగంగా వేములవా డలోని నాంపల్లి వద్ద రోడ్డుభద్రతపై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ప్రతి నెల అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు 80శాతం ప్రధానకారణాలు మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్స్, హెల్మెట్ లేకుండా, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం, మైనర్ డ్రైవిం గ్ కారణమని వివరించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించడంతో గణనీయంగా ప్రమాదాలను తగ్గించ వచ్చని సూచించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదా లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించక పోవడం, సీట్‌బెల్ట్ ఉపయోగించకపోవడం అని అన్నా రు. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరిం చాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న చెట్లకు రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయడం, తరచు ప్రమాదాలు జరిగే ప్రాం తాల్లో రబ్బర్ స్టిప్స్, ఇసుక డ్రంబులు, బారికెడ్స్, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్ర మాదంలో గాయప డిన వారిని గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభు త్వం రూ. 25వేలు ప్రోత్సహక నగదు అందజేస్తుంద న్నారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. నాంపల్లి నుంచి అనుపురం వరకు రోడ్డు వెంబడి ఉన్న చెట్లకు రాత్రి సమయంలో మూల మలుపులు కనబడేలా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, టౌన్ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, రవీందర్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.