కరీంనగర్ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద ట్రాఫిక్ ఔట్ పోస్ట్
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:14 AM
నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల రక్షణకు కరీంనగర్ బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద శనివారం ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌ను సీపీ గౌ్‌స్ ఆలం ప్రారంభించారు.
కరీంనగర్ క్రైం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల రక్షణకు కరీంనగర్ బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద శనివారం ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌ను సీపీ గౌ్‌స్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను అదుపు చేయడానికి, నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ నూతన ఔట్ పోస్ట్ బూత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గ్లాసెస్ సీపీ అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.