జాగ్రత్తగా ట్రాఫిక్ విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:07 AM
అత్యధికంగా ఉన్న ఉష్ణోగ్రతలకు జాగ్రత్తలు వహిస్తూ ట్రాఫిక్ విధులను నిర్వర్తించాలని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : అత్యధికంగా ఉన్న ఉష్ణోగ్రతలకు జాగ్రత్తలు వహిస్తూ ట్రాఫిక్ విధులను నిర్వర్తించాలని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు. ట్రాఫిక్ పోలీసులు అరోగ్య రక్షణ కు ప్రత్యేక చర్యలు చేపడుతామని అన్నారు. జిల్లా పోలీస్ కార్యాల యంలో గురువారం జిల్లాలో ట్రాఫిక్ విఽఽధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులతో పాటు హోంగార్డులు, సిబ్బందికి అరైవ్- అలైవ్ కార్య క్రమంలో భాగంగా వడగాలులు నుంచి రక్షణకు కల్పించే కూలింగ్ కళ్ల అద్దాలను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ తీవ్ర ఎండల సమయంలో విధులు నిర్వహించే సిబ్బందికి తగి న జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాఫిక్ సిబ్బంది, బ్టూకోల్ట్స్, పెట్రో కార్ వివిధ బందోబస్తులు నిర్వర్తించే, పాల్గొనే వారు నీటితోపాటు గ్లూకోజ్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎండల ప్రభావం తగ్గించే విధంగా తగిన రక్షణ చర్యలు తప్పనిసరి గా పాటించాలని తగిన జాగ్రత్తలతో విధులను నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎస్పీ కోరారు. అరైవ్- అలైవ్ కార్యక్ర మంలో భాగంగా వాహనాదారులకు, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై హెల్మెట్, సీట్ బెల్ట్, వినియోగం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహ నాలు నడుపడం వల్ల కలిగే అనరాలపై మైనర్ డ్రైవింగ్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాపిక్ అర్‌ఐ సురేష్, అర్‌ఎస్‌ఐలు రాజు, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.