పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:41 AM
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక నోడల్ అధికారిని నియమించడంతో పాటు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనం గా చేపట్టాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వాణిప్ర సాద్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక నోడల్ అధికారిని నియమించడంతో పాటు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనం గా చేపట్టాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వాణిప్ర సాద్ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర యువ జన, పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక కార్యదర్శి వాణిప్రసాద్ జిల్లాలో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు, జ్ఞాన భారతం మిషన్ అమలు పై కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించారు. వాణిప్రసాద్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధికి జిల్లాలో నోడల్ పర్యాటక అధికా రులను నియమించాలని ఆదేశించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లతో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాల న్నారు. గుర్తించిన ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, భద్రత కోసం సీసీ కెమెరాలు, వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది, ఆపరేషన్, నిర్వహణ సిబ్బంది, సైన్‌బోర్డులు, సమాచార కియోస్క్‌లకు శిక్షణ పొందిన స్థానిక గైడ్లు, టికెటింగ్ సౌకర్యం, ఫుడ్ కోర్టులు, దివ్యాంగుల కు అనుకూలమైన మార్గాలు, రహదారులు వంటి సౌకర్యాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించాలని సూచించారు. సినిమాల చిత్రీకర ణకు అనుకూలమైన ప్రాంతాలు గుర్తించి, అభివృద్ధిపరచాలన్నారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో నిర్వహిం చాలని తెలిపారు. జిల్లాకు ప్రత్యేకమైన పర్యా టక బలాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా జిల్లా పర్యాటక గుర్తింపు, బ్రాండింగ్‌ను అభి వృద్ధి చేయాలని సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో మూడు సంవత్సరాల జిల్లా పర్యాటక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, అందులో ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రాంతాలు, అభి వృద్ధి చేయాల్సిన ప్రాజెక్టులు, మౌలిక వస తుల అవసరాలు, పెట్టుబడి అవకాశాలు, సందర్శకుల సౌకర్యాలు, ప్రచార కార్యక్రమా లను స్పష్టమైన కాలపరిమితులతో పొందుపర చాలని సూచించారు. పీపీపీ విధానంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించారు. జ్ఞాన భారతం మిషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కేంద్ర ప్రభు త్వం చేపట్టిన ఈ మిషన్‌లో భాగంగా చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాచీన గ్రంథాలు, రాత ప్రతులను గుర్తించి సంరక్షిం చాలని సూచించారు. జిల్లాలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి, అందుబాటులో ఉన్న రాత ప్రతులపై సమగ్ర సర్వే చేపట్టాలని సూచించారు. ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలుగు పండితులు, ఉర్దూ పండితులు, ఇతర భాషల నిపుణుల వద్ద ఉన్న ప్రాచీన గ్రంథాల వివరాలను సేకరించి వారి సేవలను వినియో గించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. అలాగే ప్రపంచ పర్యాటక దినోత్స వాన్ని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు పర్యాటక రంగం అంశంపై పోటీలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టూరిజం శాఖ డీఈ శ్రీశైలం, డీవైఎస్‌ఓ రాందాస్, డీటీసీపీవో అన్సారీ, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.