రేపు కార్తీక పౌర్ణమి
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:49 PM
కార్తీక నమో మాసం... పరమ పవిత్రం... కార్తీకం భక్తిశ్రద్ధలతో మహిళలు ఉపవాసాలను కొనసాగిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )
కార్తీక నమో మాసం... పరమ పవిత్రం... కార్తీకం భక్తిశ్రద్ధలతో మహిళలు ఉపవాసాలను కొనసాగిస్తున్నారు. శివకేశవులకు అత్యం త ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దేవాలయాలన్నీ కార్తీక శోభతో వెలిగిపోను న్నాయి. నదీ స్నానం, దీపారాధనకు మహిళలు సిద్ధమయ్యారు. కార్తీక మాసంలో దీపం దానం చేస్తే ఉత్తమ ఫలితం వస్తుందని తులసీ, మారేడు, ఉసిరికాయలతో శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించిన వారికి అనేక శుభాలు కలుగుతాయని భావి స్తారు. కార్తీక పౌర్ణమి వస్తుండడంతో మహిళలు ప్రతి ఇంట్లో తు లసీ సన్నిధిలో, దేవాలయాల్లో దీపాన్ని వెలిగించిన వారికి ఐశ్యర్య సిద్ధి కలుగుతుందని నమ్మకంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉసిరి కాయపై దీపాలు పెట్టి వెలిగించడం శుభాలను ఇస్తుందని, శివార్చన చేసి వారికి ఎలాంటి దోషాలు ఉండవని భావిస్తారు. అందుకే దక్షిణ భారత దేశంలో కార్తీక పూర్ణిమ బహు ళ ప్రాచూర్యం పొందిన పండుగ. తమిళనాడులోని అరుణాచలంలో కొండమీద దీప స్తంభంలో వెలిగించే జ్యోతిని దర్శించడానికి వేలాది మంది భక్తులు తరలివెళుతారు. అంతేకాకుండా ప్రధాన శివాల యాలైన ప్రధాన దేవాలయాల్లో కూడా తరలివెళుతారు. ఈ రోజునే దీపోత్సవాన్ని జరుపుకుంటారు. కార్తీకపూర్ణిమ సందర్భంగా ప్రతి ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతాలు, నోములను నిర్వహించుకో వడానికి సిద్ధమయ్యారు. పౌర్ణమిరోజు ఆధ్యాత్మికం, ఆనందంతో తులసి పూజలు నిర్వహిస్తారు. వేములవాడలో భీమేశ్వరాలయంలో అశ్వద్దనారాయణ స్వామి రావిచెట్టు సన్నిధిలో జ్వాలాతోరణం, పూజలు నిర్వహిస్తారు. రాత్రి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిషి పూజ అనంతరం స్వామివారికి మహా పూజ ఏకాంతంగా జరు గుతుంది. సిరిసిల్లలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించ డానికి ఏర్పాట్లు ఆలయ కమిటీలు చేశాయి.
కార్తీక పౌర్ణమి వేళ.. దీపకాంతుల హేళ..
దేవుని ముందు దీపం వెలిగించడంలో మన పూర్వికులు నూనె ను కర్మఫలంగాను, వత్తిని శరీరంగాను, జ్వాలను ప్రాణంగా భావి స్తారు. కర్మఫలం అనే నూనె ఉన్నంత వరకే వత్తి అనే శరీరంలో జ్వాల అనే ప్రాణం ఉంటుందని భావిస్తారు. కర్మఫలం పూర్తి అవ గానే ప్రాణం శరీరాన్ని వదిలి పెడుతుందని చెబుతారు. సూర్యోదా యానికి పూర్వమే లేచి నది స్నానం చేసి పొడి బట్టలతో దీపారా ధన చేయడం మంచిదని భావిస్తారు. ఈ మాసంలో జ్వాల తోర ణాలతో వెలుగులు నింపుతాయి. ప్రతి దేవాలయాన్ని దీపాలతో మహిళలు అలంకరించడంతో శోభాయమానంగా కనిపిస్తాయి. అంతే కాకుండా మహిళలు నదులలో దీపాన్ని దానంగా ఇస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి జ్ఞానాన్ని నింపుతాయని భావిస్తారు.
ఎన్ని వత్తులు వెలిగించాలి..
దీపాలు వెలిగించడానికి ఉపయోగించే వత్తుల వల్ల కూడా ఉప యోగాలు తెలుపుతాయి. ఒక ముఖం వత్తితో వెలిగిస్తే ఒకమాదిరి లాభం కలిగితే, ద్విముఖ వత్తితో కుటుంబంలో సఖ్యతో కలుగుతుం ది. త్రిముఖ వత్తితో సంతాన భాగ్యం, ఉత్తమ సంతానం, చతుర్ము క వత్తితో ధన సంపత్తు, ఐశ్యర్యం, పంచముఖ వత్తులతో సంపద, లాభాలు కలుగుతాయని భావిస్తారు. వత్తులను పసుపు రంగు బట్టతో దేవునికి దీపాలు వెలిగించడం వల్ల దేవి కటాక్షం కలుగు తుందని భావిస్తారు. పన్నీరు, నేతితో వెలిగిస్తే కీర్తి వంతులు అవు తారని ఆరటి నార వత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి, జిల్లెడు వత్తులతో వెలిగిస్తే దుష్టశక్తుల పీడ తొలగు తుందని, కుంకుమ నీటితో తడిపిన వత్తులతో దీపాలు వెలిగిస్తే వైవాహిక చింతలు తొలగిపోతాయని, వివాహ సమస్యలు ఉండకుండా పోతాయి. శుద్ధ మైన పత్తితో వెలిగిస్తే దైవభక్తి వృద్ది చెందుతుంది. కార్తీక మాసం లోనే అయ్యప్ప భక్తుల కోలాహలం కూడా మొదలవుతుంది.