Share News

రేపు హనుమాన్‌ చిన్న జయంతి

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:14 AM

చైత్ర శుద్ధ పౌర్ణమి, గురువారం హనుమాన్‌ చిన్న జయంతిని జరుపుకోనున్నారు. త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే ఈ రోజును హనుమాన్‌ వీరోచిత, విజయోత్సవ దినంగా, శ్రీరాముడు ఆంజనేయుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజుగా పేర్కొంటారు.

రేపు హనుమాన్‌ చిన్న జయంతి
ముస్తాబైన ప్రశాంతనగర్‌ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం

కరీంనగర్‌ కల్చరల్‌ మార్చి 31 (ఆంధ్రజ్యోతి): చైత్ర శుద్ధ పౌర్ణమి, గురువారం హనుమాన్‌ చిన్న జయంతిని జరుపుకోనున్నారు. త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే ఈ రోజును హనుమాన్‌ వీరోచిత, విజయోత్సవ దినంగా, శ్రీరాముడు ఆంజనేయుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజుగా పేర్కొంటారు. సప్త చిరంజీవులలో ఒకరైన, ఉపాసనా సంబంఽధ దైవం హనుమను నిత్యం ఆరాధిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని, అపజయమనేది ఉండదని శాస్త్ర వచనం. ఈ రోజున మాలధారణలు చేసి దీక్షలను ప్రారంభిస్తారు. అంతకు ముందు దీక్షలు స్వీకరించిన వారు విరమిస్తారు. జిల్లేడు, తమాల పత్రాలతో పూజలు, మినపవడ మాలలు, పళ్లు నైవేద్యాలుగా సమర్పించడంతో పాటు శ్రీరామ, హనుమ స్తోత్రాలను పారాయణాలను చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అభిషేక, అర్చనలు, ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.

ఫ రేపు వీర హనుమాన్‌ విజయ యాత్ర

విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి వీర హనుమాన్‌ విజయ యాత్ర పేరుతో శోభాయాత్ర (బైక్‌ ర్యాలీ) జరుగనుంది. ఈ మేరకు ఆయా సంస్థల బాధ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠానికి చెందిన సర్వేశ్వరాంబికా శివయోగి శివాచార్య స్వామి హాజరు కానున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 12:14 AM