Share News

నేడు హోలీ..

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:53 PM

చిన్నాపెద్దా సంతోషంగా జరుపుకునే పండగ హోలీ. జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు మంగళవారం జరుపుకోనున్నారు.

నేడు హోలీ..

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): చిన్నాపెద్దా సంతోషంగా జరుపుకునే పండగ హోలీ. జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు మంగళవారం జరుపుకోనున్నారు. రంగుల అమ్మకాలతో మార్కెట్‌ కొత్త కళ సంతరించుకుంది. కలర్లు, వాటర్‌గన్స్‌, చెక్కరబిళ్లల దండలు, మాస్క్‌ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

పెరిగిన రంగుల ధర

ఈసారి రంగుల ధరలు పెరిగాయి. గతంలో కంటే రంగుల ధరలు అధికంగా ఉండడంతో రంగులు కొనే విషయంలో యువత, విద్యార్థులు ఆచితూచి అడుగేస్తున్నారు. రంగులకు పావుకిలోకు 40 నుంచి 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. కలర్‌ గన్స్‌ 30 నుంచి 120 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి.

ఘనంగా కామదహనం

నగరంలో పలు కూడళ్లు, వీధుల్లో కామదహనాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. భగత్‌నగర్‌లో భగత్‌నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్‌ వై సునీల్‌రావు వేడుకలను ప్రారంభించారు. 42వ డివిజన్‌లో చైతన్య యూత్‌క్ల్లబ్‌ ఆధ్వర్యంలో, ఆదర్శ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వమించిన వేడుకల్లో డిప్యూటీ మేయర్‌ వై సునీల్‌రావు పాల్గొన్నారు. సప్తగిరికాలని గంగా పరమేశ్వర ఆలయం వద్ద కాలని గంగపుత్ర జిల్లా ప్రధాన కార్యదర్శి గడప కోటేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ చాడగొండ కవితా బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. భగత్‌నగర్‌ చౌరస్తాలో వేడుకలను కార్పోరేటర్‌ సౌగాని కొమురయ్య ప్రారంభించగా స్థానిక బీజేపి నాయకులు, యువత పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 11:53 PM