నేడు దసరా..
ABN , Publish Date - Oct 20 , 2026 | 01:16 AM
ఆశ్వీయుజ మాసం.. శుక్ల పక్ష పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు జరిగే దేవీ నవరాత్రుల అనంతరం వచ్చే రోజును దసరా పండుగగా పిలుస్తారు.
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) :
శమీ శమయతే పాపం/ శమీ శతృ వినాశనం// అర్జునస్య ధనుర్ధారీ/ రామస్య ప్రియదర్శనం//
ఆశ్వీయుజ మాసం.. శుక్ల పక్ష పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు జరిగే దేవీ నవరాత్రుల అనంతరం వచ్చే రోజును దసరా పండుగగా పిలుస్తారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం దసరా పండగను జరుపుకోనున్నారు. విజయదశమి సాయంత్రం శమీదర్శనం, శమీపూజ చేయాలని శాస్త్ర వచనం. శమీ వృక్షం వద్దకు విజయదశమి నాడు చేరుకుని ప్రదక్షిణలు చేసి ఆకుని పెద్ద వారికి ఇచ్చి నమస్కరించి ఆశ్వీరాదం పొందడం ఆచారం. ఇలా శమీ వృక్షాన్ని దర్శించి పూజించడం వల్ల అన్నింటా విజయాలు లభిస్తాయని నమ్మకం. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా అంతటా మంగళవారం ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఆలయాలు, మండపాలు, వివిధ కూడళ్ళలో, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల్లో శమీపూజలను నిర్వహించనున్నారు. పిండి వంటలు, విందులు, వినోదాలలో మునిగి తేలనున్నారు.