Share News

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:44 AM

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు.

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

తంగళ్లపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. ఆదివారం పొగాకు వ్యతిరేక దినోత్సం పురస్కరించుకుని తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమి క ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా వైద్యాధికారి రజిత, స్థానిక సర్పంచ్‌ పొన్నం లక్ష్మణ్‌లు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులు వాడితే క్యాన్సర్‌ బారిన పడుతారని అన్నారు. పొగాకు కలిగే నష్టాలను వివరిం చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చంద్రికరెడ్డి, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ నయిమ్‌, సత్యనారయణ, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:44 AM