Share News

ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:27 AM

ప్రభుత్వాల నిర్ధేశిత లక్ష్యాలను సాధించకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రజిత అన్నారు.

ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి

సిరిసిల్ల టౌన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాల నిర్ధేశిత లక్ష్యాలను సాధించకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రజిత అన్నారు. గురువారం డీఎం హెచ్‌వో కార్యాలయంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, నిర్ధేశిత లక్ష్యాలపై జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ జిల్లాలోని గర్భిణుల నమోదు, ప్రమాదకర గర్భిణు ల చెకప్‌లు, సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70 శాతం జరిగే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. వ్యాధి నిరో ధక టీకాలు ఐదు సంవత్సరాల పిల్లలకు సకాలంలో ఇప్పించా లని, ఎన్సీడీ కార్యక్రమంలో రక్తపోటు మధుమోహంతో పాటు వివిధ రకాల క్యాన్సర్ల పరీక్షలను నిర్వహించాలన్నారు. టీబీ పరీక్ష కార్యక్రమంలో 60 సంవత్సరాలు పైబడిన బరువు కోల్పోయిన వారు, దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించాలన్నారు. తెమడ, చెస్ట్‌ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆర్‌బీఎస్‌కే కార్యక్ర మంలో భాగంగా ప్రభుత్వ హాస్టల్లో బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, ఆరు బయట పనిచేసే వ్యక్తులు, గుండె జబ్బులు ఉన్నవారు వేసవి కాలంలో బయట తిరిగినట్లయితే వారి శరీరాలు ఉష్ణోగ్రత 104 డిగ్రీలు ఉండ డంతో పాటు గందరగోళం, చిరాకు, తలనొప్పి కండరాల బలహీనత, వికారం, వాంతులు, గుండె స్పందన పెరగడం, శ్వాస పెరగడం వడ దెబ్బకు గురైన లక్షణాలని అన్నారు. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎలకో్ట్రలైట్లను కలిగి ఉన్న ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలని, చల్లని నీటితో శరీరాన్ని తుడవాలని, వెంటనే ఆసుపత్రికి తరలించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్‌ అధికారులు సంపత్‌, అనిత, రామకృష్ణ, నయిమా, డీపీవో రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 12:27 AM