800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:56 PM
సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా 800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామ ని ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు.
సిరిసిల్ల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా 800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామ ని ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. మంగళవారం సిరిసిల్ల, వేముల వాడ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులపై దిశా నిర్ధేశం చేశారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వ హించేందుకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో 17 రూట్ మొబైల్, ఆరు జోనల్ బృదాలు, నాలుగు రిసర్వ్, స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్‌తో తలిపి 800మంది పోలీస్ సిబ్బం దిని వినియోగిస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధు లు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లరాదని, రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించా లని, పోలింగ్ కేంద్రాల వద్ద, రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావర ణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబం ధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిళ్లు, వాట ర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుందని, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరు తప్పని సరిగా పాటించాలని, ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన తీసుకుంటాని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటిం చడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అన్నారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఆర్‌ఐ లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.